PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-in-ukbc521965-b62c-4ad9-a7a7-85e6859bee4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-in-ukbc521965-b62c-4ad9-a7a7-85e6859bee4d-415x250-IndiaHerald.jpgఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రజలు ఇందుకు సహకరిస్తూ ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ముంబై నగర పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా.. మన కుటుంబాన్ని రక్షించుకోవడం మన బాధ్యత అంటూ గుర్తు చేశారు. carona virus in uk;amala akkineni;christmas;mumbai;police;january;karnataka 1;central government;manadesam;coronavirusకరోనా వైరస్: ఆ రాష్ట్రాలలో లాక్ డౌన్ వైపు చూస్తున్న ప్రభుత్వం...?కరోనా వైరస్: ఆ రాష్ట్రాలలో లాక్ డౌన్ వైపు చూస్తున్న ప్రభుత్వం...?carona virus in uk;amala akkineni;christmas;mumbai;police;january;karnataka 1;central government;manadesam;coronavirusThu, 24 Dec 2020 09:00:00 GMTకరోనా వైరస్ భయం  ప్రపంచాన్ని చుట్టేసింది. మళ్లీ ఎటువంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందోనన్న భయం దేశ ప్రజలను కలవరపెడుతోంది. అందులోనూ ఈ వైరస్ 70 శాతం వేగంతో వ్యాపిస్తుంది అన్న న్యూస్ ప్రశాంతం గా కునుకు తీయడం లేదు. ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాలను నిషేధించింది మన భారతదేశం. ఇదే తరహాలో పలు దేశాలు కూడా  అలర్ట్ అయ్యాయి.

మనదేశంలో ఈ కొత్త వైరస్ ప్రవేశించకుండా ఉండేందుకు... పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే  కొత్త తరహా కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించాయి. ముంబై లో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ నూతన  వైరస్ నేపథ్యంలో ప్రజల్ని అలర్ట్ చేసేందుకుగాను.. నేటి(డిసెంబర్‌ 24) నుంచి జనవరి 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు కర్నాటక రాష్ట్రం ప్రకటించింది. అయితే క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని... అందుకు వెసులుబాటు కల్పిస్తూ అయితే, డిసెంబర్‌ 24 అర్ధరాత్రి నిర్వహించే ‘మిడ్‌నైట్‌ మాస్‌’ ప్రార్థనలకు మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. అయినా జాగ్రత్త వహించాలి అంటూ సూచించింది.

ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రజలు ఇందుకు సహకరిస్తూ ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ముంబై నగర పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా.. మన కుటుంబాన్ని రక్షించుకోవడం మన బాధ్యత అంటూ గుర్తు చేశారు. బార్లు, పబ్‌లపై కూడా రాత్రి 11 గంటల తరువాత తెరిచి ఉంచకుండా ఆంక్షలు విధించామన్నారు. ఇలా కఠినంగా మనల్ని మనం అదుపు చేసుకుంటే నే ఈ కొత్త తరహా కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోగలం అన్నారు.

బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని... తప్పకుండా ఈ కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో సూచించిన అంశాలను అమలు చేయాలని.. అధికారులను గుజరాత్‌ ప్రభుత్వం ఆదేశించింది. అయితే మరోవైపు మళ్లీ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు.


అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>