PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/facts-about-lockdown-rumours-in-andhra-pradeshfdfe6db5-c091-4313-9ec8-b829da90ba59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/facts-about-lockdown-rumours-in-andhra-pradeshfdfe6db5-c091-4313-9ec8-b829da90ba59-415x250-IndiaHerald.jpgడిసెంబర్ 30, 31, జనవరి 1న ఏపీలో మూడు రోజులపాటు లాక్ డౌన్ ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ మూడు రోజులపాటు రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని, షాపులు తెరవకూడదని, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించి పోతాయని వార్తలొచ్చాయి. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆశలు పెట్టుకున్న వ్యాపార వర్గాలు వణికిపోయాయి. కొత్త సంవత్సరం అంటే.. పూల బొకేలు, దండలు, కేకులు, స్వీట్లు వ్యాపారం కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇక మద్యం సంగతి చెప్పేదేముంది. వీరంతా లాక్ డౌన్ వార్తలతో అల్లాడిపోయారు. తమ వ్యాపారం పడిపోతుందlockdown;allu arjun;christmas;india;cinema;rajani kanth;january;december;traffic police;arjun 1ఏపీలో 3 రోజుల లాక్ డౌన్.. ఎప్పటినుంచంటే..?ఏపీలో 3 రోజుల లాక్ డౌన్.. ఎప్పటినుంచంటే..?lockdown;allu arjun;christmas;india;cinema;rajani kanth;january;december;traffic police;arjun 1Thu, 24 Dec 2020 08:00:00 GMTడిసెంబర్ 30, 31, జనవరి 1న ఏపీలో మూడు రోజులపాటు లాక్ డౌన్ ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ మూడు  రోజులపాటు రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని, షాపులు తెరవకూడదని, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించి పోతాయని వార్తలొచ్చాయి. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆశలు పెట్టుకున్న వ్యాపార వర్గాలు వణికిపోయాయి. కొత్త సంవత్సరం అంటే.. పూల బొకేలు, దండలు, కేకులు, స్వీట్లు వ్యాపారం కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇక మద్యం సంగతి చెప్పేదేముంది. వీరంతా లాక్ డౌన్ వార్తలతో అల్లాడిపోయారు. తమ వ్యాపారం పడిపోతుందని టెన్షన్ పడిపోయారు.

క్రిస్మస్ పండగకు మినహాయింపు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై దృష్టిపెట్టిందని, అందుకే లాక్ డౌన్ ప్రకటించారనే వార్తలొచ్చాయి. అయితే పోలీస్ అధికారులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ వ్యవహారంపై నిర్ణయం ఏదీ తీసుకోలేదని, పుకార్లు నమ్మొద్దంటూ వివరణ ఇచ్చారు. అయితే రూపాంతరం చెందిన కరోనా వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో భారత్ మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోతుందనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. ప్రస్తుతానికి వీటిని పుకార్లుగా కొట్టిపారేసినా.. పరిస్థితి చేయిదాటే అవకాశం ఉంటే కచ్చితంగా భారత్ లో మరోసారి లాక్ డౌన్ విధించడానికి ప్రభుత్వాలు వెనకాడవు.

సినీ వర్గాల్లో కలవరం..
దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ కలకలంతో సినీ వర్గాల్లో మరింత నిరాశ అలముకొంది. అటు రజినీకాంత్ కొత్త సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లపై ఇప్పటి వరకు ఆ ప్రభావం పడిందనే విషయం తేలలేదు. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ కి కరోనా వల్లే బ్రేక్ పడిందని అంన్నారుకానీ, కొత్తగా ఎక్కడా షూటింగ్ లు ఆగలేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోడానికి రెడీ అవుతున్నాయి. షూటింగ్ ల సంగతి పక్కనపెడితే థియేటర్ల రీఓపెనింగే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆవేశపడి థియేటర్లు తరిచి.. నష్టాలు వచ్చినా పర్లేదంటూ కొన్నిరోజులు రన్ చేస్తే.. ఆ తర్వాత లాక్ డౌన్ వస్తే పరిస్థితి ఏంటని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు రెండోసారి లాక్ డౌన్ పై ఆందోళన చెందుతూనే ఉన్నాయి. 


సాయి ధరమ్ తేజ్ వెనుక టోటల్ ఇండస్ట్రీ !

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>