CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-plum-cake-at-home82d1716d-7d8b-41d0-b5cd-447ad9da4798-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-plum-cake-at-home82d1716d-7d8b-41d0-b5cd-447ad9da4798-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...క్రిస్మస్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు హోరెత్తాయి. ఇక క్రిస్మస్ అంటేనే కేకులకు, కుకీస్ లకి ప్రసిద్ధి. ఇక క్రిస్మస్ సందర్బంగా రుచికరమైన ప్లమ్ కేక్ ని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.. దీన్ని చాలా సులభంగా ఎటువంటి ఆల్కహాల్, గుడ్లు లేకుండా తయారు చేసుకోవచ్చు.... ప్లమ్ కేక్ కి కావాల్సిన పదార్ధాలు.... మైదా 1.5 కప్ యోగర్ట్ 1 కప్ 1 టీ స్పూన్ వనిల్లా ఎక్స్ట్రాక్ట్ 1/2 టీ స్పూన్ డాల్చిన చెక్క పొడి 1/8 టీ స్పూplum-cake;christmas;india;king;degree;sugar;oil;king 1;letterక్రిస్మస్ సందర్బంగా రుచికరమైన ప్లమ్ కేక్స్ ని తయారు చేసుకోండిలా.....క్రిస్మస్ సందర్బంగా రుచికరమైన ప్లమ్ కేక్స్ ని తయారు చేసుకోండిలా.....plum-cake;christmas;india;king;degree;sugar;oil;king 1;letterThu, 24 Dec 2020 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...క్రిస్మస్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు హోరెత్తాయి. ఇక క్రిస్మస్ అంటేనే కేకులకు, కుకీస్ లకి ప్రసిద్ధి. ఇక క్రిస్మస్ సందర్బంగా రుచికరమైన ప్లమ్ కేక్ ని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.. దీన్ని చాలా సులభంగా ఎటువంటి ఆల్కహాల్, గుడ్లు లేకుండా తయారు చేసుకోవచ్చు....

ప్లమ్ కేక్ కి కావాల్సిన పదార్ధాలు....

మైదా 1.5 కప్
యోగర్ట్ 1 కప్
1 టీ స్పూన్ వనిల్లా ఎక్స్ట్రాక్ట్
1/2 టీ స్పూన్ డాల్చిన చెక్క పొడి
1/8 టీ స్పూన్ లవంగాల పొడి
1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా
1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్
3/4 కప్ బ్రౌన్ షుగర్

1/2 కప్ వెజిటబుల్ ఆయిల్
1 టీ స్పూన్ ఆరెంజ్ జెస్ట్
1/2 టీ స్పూన్ అల్లం

సోకింగ్ కోసం.... 1/3 కప్ నీరు
 1/3 కప్ ఆరెంజ్ జ్యూస్
 1/4 కప్ డ్రైడ్ యాప్రికాట్స్
1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
1 కప్ టూటీ ఫ్రూటీ
1/4 కప్ రైజిన్స్
1/8 కప్ ప్రూన్స్
1/8 కప్ డ్రైడ్ క్రాంబెర్రీస్

ఫోల్డింగ్ కోసం... బాదం పప్పు, జీడి పప్పు, వాల్నట్స్ 1/4 కప్ చొప్పున


క్రిస్మస్ ప్లమ్ కేక్ తయారు చేయు విధానం...అడుగు మందంగా ఉన్న సాస్ పాన్ ని లో నుండి మీడియం హీట్ మీద ఉంచి అందులో ఆరెంజ్ జ్యూస్, నిమ్మ రసం, నీరు పోయండి. ఇందులోనే టూటీ ఫ్రూటీ, రైజిన్స్, డ్రైడ్ యాప్రికాట్స్, ప్రూన్స్, క్రాంబెర్రీస్ కలపండి. డ్రై ఫ్రూట్స్ ఈ జ్యూసులని అబ్జార్బ్ చేసుకుని సిరప్ చిక్కబడే వరకూ మంట మీదే ఉంచండి.ఆ తరువాత పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇందులోనుండి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తరవాత వాడడం కోసం పక్కన పెట్టండి. ఈ లోపు ఓవెన్ ని 160 డిగ్రీ సెల్సియస్ వద్ద ప్రీ హీట్ చేయండి.

గుండ్రంగా ఉండే కేక్ పాన్ తీసుకుని దాని లోపల వైపున బటర్ పూయండి లేదా పార్చ్మెంట్ పేపర్ ఉంచండి. ఒక గ్లాస్ బౌల్ లో డ్రై ఇన్‌గ్రీడియెంట్స్ అన్నీ వేసి కొంత ఆరెంజ్ జెస్ట్ కూడా కలిపి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచండి.వేరే బౌల్ లో బ్రౌన్ షుగర్, ఆయిల్ వేసి మిశ్రమం చిక్కబడేవరకూ మిక్స్ చేయండి. ఆ తరువాత ఇందులోనే యోగర్ట్ కూడా కలిపి మళ్ళీ బాగా మిక్స్ చేయండి.చివరగా వనిల్లా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసి అన్నింటినీ డ్రై ఇన్‌గ్రీడియెంట్స్ తో కలపండి.అన్నీ పూర్తిగా కలిసేవరకూ ఫోల్డ్ చేయండి.

ఇప్పుడు సోక్డ్ డ్రై ఫ్రూట్స్, సన్నగా తరిగిన వాల్నట్స్, బాదం పప్పు, జీడి పప్పు కలిపి ఫోల్డ్ చేయండి. ఈ మొత్తం మిశ్రమాన్ని కేక్ పాన్ లోకి తీసుకోండి. 160 డిగ్రీ సెల్సియస్ వద్ద యాభై నుండి యాభై ఐదు నిమిషాల పాటూ బేక్ చేయండి. ఇప్పుడు పక్కనుంచిన సోక్డ్ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.ఇక ఇలాంటి మరెన్నో కుకింగ్ రెసిపీస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..







రజనీ కొంప ముంచిన కరోనా..అంతా అప్సెట్ !

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>