Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/justice1e9217bb-5c97-4bea-bc4c-282eff3bcfd0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/justice1e9217bb-5c97-4bea-bc4c-282eff3bcfd0-415x250-IndiaHerald.jpgఉన్నత చదువులు చదువుకోగానే సరిపోదు.. అంతే ఉన్నతంగా ఆలోచించాలి. అలా ఆలోచించలేనప్పుడు ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వ్యర్థమే. ఇలాంటి వ్యర్థపు చదువు చదువుకున్న ఓ రిటైర్డ్ ఎస్పీ చేసిన దుర్మార్గమే ఇది. తాను ఎంతో కష్టపడి చదువుకుని ఎస్పీ అయ్యాడు. కానీ కోడలు చదువుకుంటానంటే మాత్రం ససేమిరా అన్నాడు. అదేంటని ప్రశ్నిస్తే.. అమానుషంగా...justice;amaravati;guntur;police;village;husband;traffic policeకోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!justice;amaravati;guntur;police;village;husband;traffic policeThu, 24 Dec 2020 20:54:00 GMTఅమరావతి: ఉన్నత చదువులు చదువుకోగానే సరిపోదు.. అంతే ఉన్నతంగా ఆలోచించాలి. అలా ఆలోచించలేనప్పుడు ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వ్యర్థమే. ఇలాంటి వ్యర్థపు చదువు చదువుకున్న ఓ రిటైర్డ్ ఎస్పీ చేసిన దుర్మార్గమే ఇది. తాను ఎంతో కష్టపడి చదువుకుని ఎస్పీ అయ్యాడు. కానీ కోడలు చదువుకుంటానంటే మాత్రం ససేమిరా అన్నాడు. అదేంటని ప్రశ్నిస్తే.. అమానుషంగా ఇంటి నుంచే వెళ్లగొట్టాడు. దీంతో హతాశురాలైన ఆమె దిశ పోలీస్ స్టేషన్‌ చేరుకుని న్యాయం కోసం అర్థించింది. కానీ మామ రిటైర్డ్ పోలీస్ కావడంతో వారు పట్టించుకోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో మీడియాను ఆశ్రయించింది.

ఆయన ఏస్పీగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం గుంటూరులోని రెంటచింత మండలం జెట్టిపాలెం గ్రామంలో నివశిస్తున్నారు. 2017లో అదే గ్రామానికి చెందిన యువతితో తన కుమారుడికిచ్చి  వివాహం జరిపించాడు. పెళ్ళి సమయంలో కట్నకానుకలు బాగానే స్వాహా చేశాడు. అయితే పెళ్లైన యేడాదిన్నర తర్వాత ఆమె తనకు పైచదువులు చదువుకోవాలని, పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నానని మామయ్యతో చెప్పింది. అంతే ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. తన కొడుకు ఇంటర్‌తో చదువు ఆపేయడం‌తో కోడలు కూడా చదువుకోకూడదనేది అతడి ఆలోచన. అక్కడి నుంచే సమస్య ప్రారంభమైంది. చదవడానికి వీల్లేదని ఆదేశించాడు. అయితే ఆ యువతి మాత్రం తాను పీహెచ్‌డీ చదవాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో తన మాట కాదన్నందుకు ఆమెను కుటుంబమంతా కలిసి ఇంటి నుంచి గెంటేశారు.

ఊహించని ఈ పరిణామంతో ఆ యువతి పెద్దమనుషుల వద్దకు వెళ్లింది. అయితే వారు చెప్పినా భర్త కుటుంబం పట్టించుకోలేదు. ఆమె తమ కుటుంబానికి అవసరం లేదని, వెంటనే తన కొడుకుకు విడాకులు ఇచ్చేసి తన దారి తను చూసుకోవాలని అన్నారు. దీంతో తల్లిదండ్రులు ద్వారా రెంటచింతల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధిత యువతి దిశా స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మామ రిటైర్డ్ ఎస్పీ కావడంతో అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో నేరుగా యువతి గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని భర్త ఇంటికి వెళ్లింది. లోనికి వెళ్లడానికి ప్రయత్నించగా.. ఆమెను బయటకు నెట్టి తలుపులు వేసుకుందా కుటుంబం. దీంతో భర్త ఇంటి ముందే బైఠాయించి తన ఆవేదన వెళ్లగక్కింది.

విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న సీఐ.. యువతిని అక్కడి నుంచి లేపి పంపించి వేశారు. అయితే ఆమె పరిస్థితి తెలుసుకుని కలెక్టర్‌ను గానీ, ఎస్పీని గానీ కలవాలని సూచించారు. అయితే దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ యువతి ఎలాగైనా తనకు న్యాయం చేయాలని మీడియాను కోరుతోంది.


పవన్ ఫిక్స్ అయిపోయారా? జనసేన అడ్వాంటేజ్ ఇదేనా?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>