Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/australian-former-spinner-warne-siad-that-australia-will-blow-off-india-in-second-test-tooe07ef25f-298d-46a3-8575-bdc0fea0ed62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/australian-former-spinner-warne-siad-that-australia-will-blow-off-india-in-second-test-tooe07ef25f-298d-46a3-8575-bdc0fea0ed62-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా-టీంఇండియా మధ్య రెండో టెస్ట్ శనివారం జరగనుంది. అయితే తొలి టెస్టులో విజయం అంచుల నుంచి ఓటమి పాలైన టీంఇండియా రెండో టెస్టులో అయినా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీనికోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ టీంఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఏడాదికి చివరిదైన బాక్సింగ్ టెస్టు కూడా..warne;anoushka;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;india;australia;wife;rahul sipligunj;letter;yuva;adelaide;mohammed shami;paruguటీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్warne;anoushka;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;india;australia;wife;rahul sipligunj;letter;yuva;adelaide;mohammed shami;paruguThu, 24 Dec 2020 21:24:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా-టీంఇండియా మధ్య రెండో టెస్ట్ శనివారం జరగనుంది. అయితే తొలి టెస్టులో విజయం అంచుల నుంచి ఓటమి పాలైన టీంఇండియా రెండో టెస్టులో అయినా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీనికోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ టీంఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఏడాదికి చివరిదైన బాక్సింగ్ టెస్టు కూడా ఆసీస్‌దేనని, ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు భారత్‌ను మరింత ఘోరంగా ఓడిస్తుందని చెప్పుకొచ్చాడు.

‘భారత జట్టులో క్లాస్ ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. కేఎల్ రాహుల్, ఆజింక్య రహానే, చటేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లు క్లాస్ ఆటగాళ్లు టీంఇండియాలో ఉన్నారు. వీరు తమదైన రోజున ఎలాంటి ప్రదర్శన చేయగలరో అందరికీ తెలుసు. వీరే కాదు. శుభ్‌మన్ వంటి యువ ఆటగాళ్లూ జట్టులోకి వస్తే భారత్ మరింత పటిష్ఠమవుతుంది. అయినా భారత్‌ను ఓటమి నుంచి వీళ్లెవరూ కాపాడలేరు. ఈ టెస్టులోనూ టీం ఇండియాకు పరాభవం తప్పదు. ఈ టెస్టులో భారత్‌ను ఆసీస్ ఊడ్చిపారేస్తుంది. కచ్చితంగా బాక్సింగ్ డే టెస్ట్ కూడా ఆసీస్‌దే’నని వార్నర్ అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శనివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో టెస్ట్ జరగనుంది. ఈ టెస్టు ప్రారంభానికి ముందుగానే వార్న్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అయితే పేసర్ మహ్మద్ షమీ జట్టు నుంచి వెళ్లిపోవడం టీంఇండియాకు గట్టి దెబ్బని, ఇది భారత్ గెలుపు ఆశలను మరింత దిగజార్చతుందని వార్న్ అన్నాడు. మెల్‌బోర్న్ వంటి డ్రాప్ ఇన్ పిచ్‌లపై షమీ అద్భుతంగా బౌలింగ్ చేయగలడని కితాబిచ్చాడు. అతడు లేకపోవడం పెద్ద లోటని అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉంటే ఈ నెల 17న అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులతో మంచి ప్రదర్శన చేసింది. అలాగే బౌలర్లు కూడా ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. భారత్ చేసిన పరుగులకంటే 53 తక్కవకే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ మొత్తం 191 పరుగులకే కుప్ప కూలడంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని విధంగా ఒకరి తరువాత ఒకరిగా బ్యాట్స్‌మెన్ మొత్తం పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రీజ్‌లోకి వచ్చినంత సేపు కూడా నిలబడలేకపోయారు.

దీంతో భారత్ టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త ప్రదర్శన చేసి కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో కేవలం 90 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ 21 ఓవర్లలోనే 93 పరుగులు చేసి విజయం సాధించారు. విచిత్రం ఏంటంటే ఈ 93 పరుగులు చేయడానికి కూడా ఆసీస్ 2 వికెట్లు పోగొట్టుకుంది. దీంతో 4 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

ఇలాంటి తరుణంలో రెండో టెస్టులో కోహ్లీ లేకపోవడం భారత్‌కు మరింత నష్టం కలిగించే అవకాశం ఉందని మాజీల అంచనా. భార్య అనుష్క ప్రసవించనుండడంతో కోహ్లీ భారత్‌ తిరిగిరానున్నాడు. ఇక రెండు రోజుల్లో ప్రారంభం కాబోయే బాక్సింగ్ డే టెస్టులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.


టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!

తెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>