PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan934e7989-cc42-44f6-b7eb-93e6816c947d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan934e7989-cc42-44f6-b7eb-93e6816c947d-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఎస్సీ యువతి స్నేహలతది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తల్లి వాపోతోంది అని మండిపడ్డారు. గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడ అని నిలదీశారు. ఆడపిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న వ్యక్తి వారిపట్ల కంశుడిలా తయారయ్యారు అని మండిపడ్డారు. జగన్ జీవితమే ఒక ఫేక్. చట్టమే రాని దిశ చట్టానికి పోలీసు స్టేషన్లు పెట్టి వాహనాలు పంపిణీ చేశారు అని విమర్శించారు. chandrababu,jagan,ycp,tdp,ap;manu;jagan;scheduled caste;smart phone;police;chief minister;murder;police station;murder.;tdp;traffic police;pulivendula;fatherజగన్ జీవితమే ఒక ఫేక్... వివేకా మర్డర్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుజగన్ జీవితమే ఒక ఫేక్... వివేకా మర్డర్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుchandrababu,jagan,ycp,tdp,ap;manu;jagan;scheduled caste;smart phone;police;chief minister;murder;police station;murder.;tdp;traffic police;pulivendula;fatherThu, 24 Dec 2020 18:10:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఎస్సీ యువతి స్నేహలతది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తల్లి వాపోతోంది అని మండిపడ్డారు. గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడ అని నిలదీశారు. ఆడపిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న వ్యక్తి వారిపట్ల కంశుడిలా తయారయ్యారు అని మండిపడ్డారు. జగన్ జీవితమే ఒక ఫేక్. చట్టమే రాని దిశ చట్టానికి పోలీసు స్టేషన్లు పెట్టి వాహనాలు పంపిణీ చేశారు అని విమర్శించారు.

అదే దిశ పోలీస్ స్టేషన్ కు స్నేహలత తల్లి ఫోన్ చేస్తే స్పందన లేదు అని మండిపడ్డారు. 19నెలల్లో జరిగిన హత్యాచారాలు, ఆడబిడ్డలపై వేధింపులు  గతంలో ఎప్పుడూ జరగలేదు అన్నారు. అనంతపురం జిల్లాలోనే వరుసగా మూడు సంఘటనలు జరిగాయి అని మండిపడ్డారు. తండ్రి చనిపోయాడని ఓదార్పు యాత్రలు చేసి సానుభూతి కోసం నానా గడ్డి తినీ ఇప్పుడు ఆడబిడ్డలపై కనికరం లేకుండా  వ్యవహరిస్తారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి. వైకాపా అరాచకాలకు అడ్డు అదుపు లేదా అని నిలదీశారు.

ఆడపిల్లల మానానికి శీలానికి రక్షణ కల్పించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ఆయన విమర్శించారు. ఇంత దారుణాలు జరిగితే పులివెందుల నుంచి అనంతపురం ముఖ్యమంత్రి వెళ్లలేరా అని ఆయన ప్రశ్నించారు. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ మనుషుల్ని మనుషుల్లా చూడట్లేదు అని మండిపడ్డారు. కుక్కలకు బిస్కెట్లు వేసిన మాదిరి ప్రజల్ని చూస్తున్నారు అని ఆయన విమర్శించారు. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి రాజకీయ కక్షల కోసం పోలీసుల్ని వాడటం రాష్ట్రానికి చేటు అని ఆయన అన్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినప్పుడే జగన్ ఫేక్ వ్యక్తని తేలిపోయిందని విమర్శలు చేసారు. డబ్బుల వ్యామోహం, స్వప్రయోజనాల కోసం ముందుకు పోతున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు అన్నారు.


ప్రారంభమైన సుప్రీం హీరో సుకుమార్ సినిమా...

అప్పుడు విమర్శినట్లుగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారుగా..?

కమలం నేతలకు.. పోలీసులకు మధ్య మాటల మంటలు..!

15 నిమిషాలు ఇవ్వండి... ఓల్డ్ సిటీలో దుమ్ము రేపుతా

2022 నుంచి 10 జట్లతో ఐపీఎల్.. ఒలింపిక్స్‌లో టీ20కి బీసీసీఐ మద్దతు

సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>