Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/vijayashanti2d4f0192-b54c-44e2-b50d-1b70228d4270-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/vijayashanti2d4f0192-b54c-44e2-b50d-1b70228d4270-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి టీఆర్‌ఎస్‌కు కీలక ప్రత్యర్థిగా మరింది. అయితే బీజేపీలోకి రాములమ్మ విజయశాంతి రాకతో పార్టీకి ఓ కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది. ఆమె ఎప్పటినుంచో తెలంగాణ ప్రజలతో మమేకం అయి ఉండడం వల్ల పార్టీ అధిష్ఠానం కూడా ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించాలని ...vijayashanti;vijayashanti;ramu;hyderabad;bharatiya janata party;telangana;capital;assembly;success;yatra;partyతెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటుందా..?తెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటుందా..?vijayashanti;vijayashanti;ramu;hyderabad;bharatiya janata party;telangana;capital;assembly;success;yatra;partyThu, 24 Dec 2020 20:26:00 GMTహైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి టీఆర్‌ఎస్‌కు కీలక ప్రత్యర్థిగా మరింది. అయితే బీజేపీలోకి రాములమ్మ విజయశాంతి రాకతో పార్టీకి ఓ కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది. ఆమె ఎప్పటినుంచో తెలంగాణ ప్రజలతో మమేకం అయి ఉండడం వల్ల పార్టీ అధిష్ఠానం కూడా ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించాలని భావిస్తోందట. త్వరలో బీజేపీ చేపట్టనున్న బస్సు యాత్ర బాధ్యతలన్నీ ఆమెకే అప్పగించాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఈ యాత్రతో రాష్ట్ర ప్రజలను బీజేపీవైపు తిప్పడంలో రాములమ్మ సక్సెస్ అవుతారని బీజేపీ భావిస్తోంది.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యర్థిగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడమే కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలోనూ ఊహించని విధంగా 48 స్థానాలు సాధించి ఔరా అనిపించింది. ఈ గెలుపుతో టీఆర్‌ఎస్ కోటలో కలకలం రేపింది. ఇప్పుడు అదే ఊపును రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపాలని పార్టీ నాయకత్వం ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ జెండా ఎగరేయాలని కమలదళం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలోని కీలక నేతలతో పాద యాత్ర నిర్వహించాలని, అంతకంటే ముందు ముందు రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజలకు మరింత చేరువ కావచ్చని బీజేపీ ఆలోచన. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. పాదయాత్ర బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చూసుకోనుండగా.. బస్సు యాత్ర బాధ్యతలన్నీ విజయశాంతికి అప్పగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయమట.

రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే అనేకమంది కీలక నేతలను బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అలా వచ్చిన నాయకురాలే విజయశాంతి. ఆమె మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడమో.. సరైన గుర్తింపు లభించడం లేదన్న కారణమో ఆమె చాలాకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇక చివర్లో మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. అలాంటి సమయంలో ఆమెకు బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. పార్టీలో చేరాలని ఆహ్వానం అందింది. దీనికి ఆమె కూడా అంగీకరించి కాషాయ జెండా అందుకున్నారు. ఇక ఇప్పుడు పార్టీలో కీలక బాధ్యతలు సైతం అప్పగిస్తుండడంతో రాములమ్మపై పార్టీ భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ అంచనాలను ఆమె ఎంతవరకు నెరవేర్చగలుగుతారో వేచి చూడాలి.


పవన్ ఫిక్స్ అయిపోయారా? జనసేన అడ్వాంటేజ్ ఇదేనా?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>