MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/vijaye5053685-7738-44e0-845d-281febb6ce8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/vijaye5053685-7738-44e0-845d-281febb6ce8c-415x250-IndiaHerald.jpgయూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు రౌడీ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ కు అన్ని భాషల్లోనూ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.. సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూడ్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారిలో కొత్త జోష్ ని నింపుతూ ఉంటాడు.. vijay;koti;vijay;vijay deverakonda;christmas;cinema;media;hero;joseph vijay;josh;fighter;devarakondaరౌడీ హీరో కి ఈ ఘనత ఎలా సాధ్యం..?రౌడీ హీరో కి ఈ ఘనత ఎలా సాధ్యం..?vijay;koti;vijay;vijay deverakonda;christmas;cinema;media;hero;joseph vijay;josh;fighter;devarakondaThu, 24 Dec 2020 20:30:00 GMTవిజయ్ దేవరకొండ కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు రౌడీ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ కు అన్ని భాషల్లోనూ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.. సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూడ్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారిలో కొత్త జోష్ ని నింపుతూ ఉంటాడు..

విజయ్ దేవరకొండ కు సోషల్ మీడియాలోనూ మాంచి ఫాలోయింగ్  ఉన్న విషయం తెలిసిందే.. తాజాగా విజయ్ ఓ అరుదైన ఘనతని సాధించాడు. సౌత్ లోనే ఏ యాక్టర్ కి దక్కని అరుదైన ఘనత అందుకున్నాడు విజయ్ దేవరకొండ.. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ (కోటి మంది) మైలురాయిని అందుకున్నాడు.   ఈ ఘ‌న‌త సాధించిన తొలి ద‌క్షిణ భార‌తీయ న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ నిలిచాడు. సౌత్‌లో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను రెండేన్నరేళ్ల కింద ప్రారంభించగా అతి తక్కువ కాలంలోనే ఈ ఫీట్ సాధించాడు.

ఇప్పటికే ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30లో సైతం విజయ్‌ దేవరకొండ స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. ఇండియాకు చెందిన 30 ఏళ్లలోపు వయసు ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క తెలుగు నటుడు విజయ్‌ దేవరకొండ. ఇక కరోనా నేపథ్యంలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి తన వంతు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.. అంతేకాదు ప్రతి క్రిస్మస్ కి 'దేవర శాంటా' పేరుతో అభిమానులకు కావాల్సింది ఇస్తూ తన ఉదారతను చాటుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్..


బయటపడిన రణబీర్ కపూర్ రహస్యం...!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..

అనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!

ఫ్యాన్స్‌కు ప్రభాస్ వీడియో సందేశం.. ఏమన్నాడంటే..

దిల్ రాజు గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>