PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamil-naducbd72a90-ebed-426b-9ce3-13edacfd01ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamil-naducbd72a90-ebed-426b-9ce3-13edacfd01ab-415x250-IndiaHerald.jpgతమిళనాడులో వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరం. జమిలి ఎన్నికలపై కేంద్రం ఇంకా ఓ నిర్ణయం తీసుకొని పక్షంలో వచ్చే ఏడాది తమిళనాడులో సార్వత్రిక ఎన్నికల నగారా మోగుతుంది. ఇప్పటికే ఉనికిలో ఉన్న పార్టీలతో పాటు కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరీ ప్రత్యేకించి సినీ క్రేజు, మోజు, ఎంతో ఇమేజ్ ఉన్న వెండితెర తారలు కొత్త పార్టీలు పెడుతూ వస్తున్నారు.tamil nadu;kushi;m. karunanidhi;rajani kanth;january;tamil;tamilnadu;letter;central government;partyతమిళ నాట మరో కొత్త పార్టీతమిళ నాట మరో కొత్త పార్టీtamil nadu;kushi;m. karunanidhi;rajani kanth;january;tamil;tamilnadu;letter;central government;partyThu, 24 Dec 2020 15:22:08 GMTతమిళనాడులో వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరం. జమిలి ఎన్నికలపై కేంద్రం ఇంకా ఓ నిర్ణయం తీసుకొని పక్షంలో వచ్చే ఏడాది తమిళనాడులో సార్వత్రిక ఎన్నికల నగారా మోగుతుంది. ఇప్పటికే ఉనికిలో ఉన్న పార్టీలతో పాటు కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరీ ప్రత్యేకించి సినీ క్రేజు, మోజు, ఎంతో ఇమేజ్ ఉన్న వెండితెర తారలు కొత్త పార్టీలు పెడుతూ వస్తున్నారు.


ఎన్నాళ్లగానో తమిళ్ సూపర్ స్టార్ రజిని రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. తమ అభిమాన కథానాయకుడిని రాజకీయ తెరపై కూడా చూసే వేడుకను కల్పించాలంటూ రజిని ఫాన్స్ ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఎన్నికలు వస్తున్నాయి..పోతున్నాయి కానీ రజిని నుంచి సానుకూల ప్రకటన రాలేదు. 


ఎట్టకేలకు ఈ సారి పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ రాజకీయ ప్రకటన చేశారు. దాంతో, ఆయన అభిమానులంతా ఖుషి అయ్యారు. అలా ఓ సూపర్ స్టార్ మొదటి అధ్యాయం ముగిసింది. 


ఇదిలా ఉండగా తమిళనాట మరో కొత్త పార్టీ పుట్టుకొస్తోందంటూ సంకేతాలు వెలువడుతున్నాయి. మాజీ సీఎం కరుణానిధి కుమారుడు అళగిరి తానూ ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ సూచనప్రాయంగా తెలిపారు. గోపాలపురంలో ఉంటున్న తన తల్లి దయాళు అమ్మాళ్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెని కలిసేందుకు అళగిరి గోపాలపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ౩న అనుచరులు, కార్యకర్తలతో ఓ సమావేశం నిర్వహిస్తున్నానని చెప్పారు. ఆ సమావేశంలోనే కొత్త పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ చేస్తానన్నారు. కార్యకర్తలు కొత్తపార్టీ పెట్టాలని సూచిస్తే తప్పకుండా స్థాపిస్తానంటూ ప్రకటించారు. ఈ సందర్భంగానే డీఎంకే కి మద్దతు ఇవ్వనంటూ ఖరాకండిగా చెప్పేసారు. 


షూటింగ్ లో ఉన్న రజిని చెన్నయి రాగానే కలుస్తానని తెలిపారు. బహుశా, ఆయనతో కూడా రాజకీయ అంశాలు చర్చలోకి వచ్చే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. సో..తమిళనాట మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందని అళగిరి వ్యాఖ్యల బట్టీ అర్ధమవుతోంది.  



ఆదివాసీ గూడెంలో పవన్ కళ్యాణ్

చిరంజీవిపై విరుచుకుపడ్డ బాలకృష్ణ. ఆ నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఆదివాసీలు పాడిన ఆ పాట వింటుంటే ఆయన రాసిన ‘వనవాసి’ గుర్తుకొచ్చింది: పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ఇంకు ఖర్చు వృధా ఎందుకు.. అందుకే పేరు మార్చుకున్నా..!

ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్.ఆమె ఎవరో తెలుసా..?

రామ్ రెడ్ ట్రైలర్ చూశారా.. డబుల్ రోల్‌లో అదరగొట్టాడు

తండ్రితో పొలం వెళ్లిన మూడేళ్ళ చిన్నారి.. చివరికి సజీవదహనం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>