PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/another-turning-point-on-jagan-govte602dd30-39ce-4484-83bf-7732549b69bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/another-turning-point-on-jagan-govte602dd30-39ce-4484-83bf-7732549b69bf-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో జగన్ విజయం ఓ సంచలనమనే విషయం తెలిసిందే. ఆ విజయానికి తగ్గట్టుగానే జగన్ సంచలన పాలనతో దూసుకెళుతున్నారు. అద్భుతమైన పథకాలు అందిస్తున్నారు. అదిరిపోయే నిర్ణయాలతో ముందుకెళుతున్నారు. అయితే జగన్ అందిస్తున్న పాలనకు ప్రజలు బాగానే మద్ధతు ఇస్తున్నారు. ఇక జగన్‌ని ఎలాగైనా నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది. jagan;tiru;jagan;andhra pradesh;dwcra;court;december;tdp;ycp;ammavodiజగన్‌కు మరో టర్నింగ్ పాయింట్...తిరుగుండదా?జగన్‌కు మరో టర్నింగ్ పాయింట్...తిరుగుండదా?jagan;tiru;jagan;andhra pradesh;dwcra;court;december;tdp;ycp;ammavodiThu, 24 Dec 2020 04:00:00 GMTఏపీ రాజకీయాల్లో జగన్ విజయం ఓ సంచలనమనే విషయం  తెలిసిందే. ఆ విజయానికి తగ్గట్టుగానే జగన్ సంచలన పాలనతో దూసుకెళుతున్నారు. అద్భుతమైన పథకాలు అందిస్తున్నారు. అదిరిపోయే నిర్ణయాలతో ముందుకెళుతున్నారు. అయితే జగన్ అందిస్తున్న పాలనకు ప్రజలు బాగానే మద్ధతు ఇస్తున్నారు. ఇక జగన్‌ని ఎలాగైనా నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది.

ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. అలాగే ప్రతి పథకంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రజలు ఇంకా జగన్ వైపే ఉన్నారు. ఎందుకంటే ఆయన అందిస్తున్న సంక్షేమమే శ్రీరామరక్షగా నిలుస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతుంది. ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ అనేక సంక్షేమ పథకాలు అందించారు. పింఛన్లు దగ్గర నుంచి చూసుకుంటే తాజాగా ఇచ్చే ఇళ్ల పట్టాల పంపిణీ వరకు జగన్ అనేక పథకాలు అందించారు.

పింఛన్లు, రైతు భరోసా, కాపు నేస్తం, డ్వాక్రా రుణమాఫీ, చేయూత, అమ్మఒడి, ఇంకా కులాల వారీగా అనేక పథకాలు అందించారు. అసలు మొత్తానికి చూసుకుంటే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జగన్ పథకాలు అందించారు. అందుకే జగన్‌కు ఇంకా ఫాలోయింగ్ తగ్గడం లేదు. అయితే ఇప్పటివరకు ఇచ్చిన పథకాలు ఒక ఎత్తు అయితే డిసెంబర్ 25న రాష్ట్రంలోనే 30 లక్షల మంది పేద వాళ్ళకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.

పల్లెటూరు, పట్టణాల్లో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు. అయితే ఈ ఇళ్ల పట్టాల విషయంలో సైతం ప్రతిపక్షం నుంచి విమర్శలు వచ్చాయి. ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. అలాగే వీటిపై కోర్టులకు కూడా వెళ్లారు. కొన్ని భూముల వివాదాల్లో ఉండటంతో అవి కోర్టుల్లోనే ఉన్నాయి. ఆ భూములని మినహాయించి పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఇళ్ల పట్టాలే జగన్‌కు పెద్ద ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అమ్మఒడి మాదిరిగానే ఇళ్ల పట్టాలు మరో టర్నింగ్ పాయింట్ కానుంది.




ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>