PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid197736d805-5e5d-464c-b328-970c8c244534-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid197736d805-5e5d-464c-b328-970c8c244534-415x250-IndiaHerald.jpgబ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. గడిచిన రోజుల్లో బ్రిటన్‌ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి చేరుకున్నారన్న సమాచారంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. బ్రిటన్ నుంచి నెల రోజుల నుంచి వచ్చిన వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఈ మేరకు కొత్త రకం వైరస్‌ గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్‌లో జన్యు విశ్లేషణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. covid19;india;telangana;festival;chief minister;news;central governmentనిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రంనిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రంcovid19;india;telangana;festival;chief minister;news;central governmentThu, 24 Dec 2020 09:30:15 GMTతెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. గడిచిన రోజుల్లో బ్రిటన్‌ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి చేరుకున్నారన్న సమాచారంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. బ్రిటన్ నుంచి నెల రోజుల నుంచి వచ్చిన వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఈ మేరకు కొత్త రకం వైరస్‌ గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్‌లో జన్యు విశ్లేషణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

      నిమ్స్ లో ఏర్పాటు చేయనున్న కొత్త జన్యు విశ్లేషణ కేంద్రం  ఏర్పాటుకు రూ.40కోట్ల వ్యయం కానుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీసీఎంబీలో జన్యుపరిశోధనలు సాగుతున్నాయి. గత నెల రోజుల్లో బ్రిటన్‌ నుంచి తెలంగాణకు సుమారు మూడు వేల మంది వరకు వచ్చినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 800 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీకి ముందుగా బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా తేలిన ఇద్దరి నమూనాలను అధికారులు సీసీఎంబీకి పంపారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యుల చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 12 ఆస్పత్రులను వైద్య ఆరోగ్యశాఖ ఎంపిక చేసింది. ఇందులో వారికి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

      బ్రిటన్ లో కరోనా రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెపుతున్న నేపధ్యంలో వివిధ ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో భారత్ కూడా అప్రమత్తమై తక్షణమే అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులలో బ్రిటన్ తదితర దేశాల నుండి వస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్టీపిసిఆర్ టెస్టులు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఒకపక్క పండుగ సీజ‌న్, మరోపక్క చ‌లికాలం దృష్ట్యా దేశంలోని ప‌లు రాష్ట్రాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. మన దేశంలోని ఒక్కో రాష్ట్రం మెల్లమెల్లగా మళ్ళీ రాత్రిపూట క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంటున్నాయి.ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర, గుజ‌రాత్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తుండగా… తాజాగా క‌ర్ణాట‌క‌లో కూడా రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. రాత్రి 10గంట‌ల నుండి ఉద‌యం 6గంట‌ల వ‌ర‌కు అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు మినహా అన్నింటికి క‌ర్ఫ్యూ ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తెలిపింది. నైట్ కర్ఫ్యూకి రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు




అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>