MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhiccaaad0b-5192-4037-b0a1-64600d0ba0a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhiccaaad0b-5192-4037-b0a1-64600d0ba0a1-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ ఊపు ఇపుడు మామూలుగా లేదు. బయట కేక పెట్టిస్తున్నాడు. ఇలా టైటిల్ విన్నర్ గా కప్ అందుకుని బయటకు వచ్చాడో లేదో అలా వరసపెట్టి బడా బడా ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నాడు. కూల్ గా అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేస్తూ అభిజిత్ బయట కూడా తమ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో నిరూపించుకుంటున్నాడు. అభిజిత్ విన్నర్ అయినా అతనికి ప్రైజ్ మనీ సగానికి సగం దక్కడం విషయంలో చర్చ ఓ వైపు సాగుతోంది. abhi;prabhas;nagarjuna akkineni;abhijith;prema;cinema;bigboss;king;love;interview;winner;prize;king 1;winner1;romantic;darling;love storyఅభిజిత్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన నాగ్ ?అభిజిత్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన నాగ్ ?abhi;prabhas;nagarjuna akkineni;abhijith;prema;cinema;bigboss;king;love;interview;winner;prize;king 1;winner1;romantic;darling;love storyThu, 24 Dec 2020 11:00:00 GMTబిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ ఊపు ఇపుడు మామూలుగా లేదు. బయట కేక పెట్టిస్తున్నాడు. ఇలా టైటిల్ విన్నర్ గా కప్ అందుకుని బయటకు వచ్చాడో లేదో అలా వరసపెట్టి బడా బడా ఛానళ్ళకు  ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నాడు. కూల్ గా అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేస్తూ అభిజిత్ బయట కూడా తమ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో నిరూపించుకుంటున్నాడు. అభిజిత్ విన్నర్ అయినా అతనికి ప్రైజ్ మనీ సగానికి సగం దక్కడం విషయంలో చర్చ ఓ వైపు సాగుతోంది.

దాని మీద వచ్చిన వివాదాలను సైతం అభిజిత్ తెలివిగానే సైడ్ చేస్తూ అది బిగ్ బాస్ నిర్వాహకులు తేల్చాల్సిన విషయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అభిజిత్ తాను మళ్ళీ సినిమాల్లో నటిస్తానని, తనను తాను ప్రూవ్ చేసుకుంటానని కూడా చెబుతున్నాడు. ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అని కూడా అంటున్నాడు.

ఇదిలా ఉంటే అభిజిత్ కి సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయని అంటున్నారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ ఈ కూల్ బాయ్ ని రొమాంటిక్ హీరోగా పెట్టి మూవీ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. దానితో పాటు అదిరిపోయే ఆఫర్ ఒకటి అభిజిత్ కి ఏకంగా కింగ్ నాగార్జున నుంచే వచ్చిందని అంటున్నారు.

నాగార్జున తన సొంత బ్యానర్ లో అభిజిత్ ని హీరోగా పెట్టి మూవీ తీయడానికి రెడీ అవుతున్నారన్నదే ఈ టాక్. ఈ మూవీలో కూడా అభిజిత్ రొమాంటిక్ రోల్ ప్లే చేస్తాడని చెబుతున్నారు. అదే కనుక నిజం అయితే అభిజిత్ పంట పండినట్లేనని అంటున్నారు. అభిజిత్ క్లీన్ అండ్ నీట్ లవ్ స్టోరీ ఈ టైం లో చేస్తే కచ్చితంగా క్లిక్ అవుతుందని కూడా అంటున్నారు.

అభిజిత్ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తరువాత ఒక్కసారిగా అతని ఇమేజ్ పెరిగిపోయింది. ఫెమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.   ప్రభాస్ తరువాత డార్లింగ్ అని పిలిపించుకునే రేంజికి చేరాడు. మరి అభిజిత్ ని కనుక హీరోగా పెట్టి ప్రేమ కధలు తీస్తే కచ్చితంగా హిట్ అవడం గ్యారంటీ అంటున్నారు. మరి అభిజిత్ సెకండ్ ఇన్నింగ్స్ అతన్ని టాప్ రేంజి లోకి చేరుస్తాయా లేదా అన్నది చూడాలి.
 


పుష్ప పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుందిగా..?

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>