PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fastag-complusaru-from-january-146f67e7c-8c25-4a27-affc-8e2591f9ed5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fastag-complusaru-from-january-146f67e7c-8c25-4a27-affc-8e2591f9ed5a-415x250-IndiaHerald.jpgకేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ఇకపై ఫాస్టాగ్ లు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ లు ఉంటేనే టోల్ ప్లాజాల వద్ద అనుమతిస్తారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఓ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. ప్రయాణికులకు ఫాస్టాగ్ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. fastag;nitin;nithin;adah sharma;nitin gadkari;rbi;amazon;january;november;central government;nithin reddy;vజనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి!జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి!fastag;nitin;nithin;adah sharma;nitin gadkari;rbi;amazon;january;november;central government;nithin reddy;vThu, 24 Dec 2020 21:29:32 GMTకేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ఇకపై ఫాస్టాగ్ లు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ లు ఉంటేనే టోల్ ప్లాజాల వద్ద అనుమతిస్తారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.  ఓ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. ప్రయాణికులకు ఫాస్టాగ్ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.  నగదు చెల్లింపుల కోసం వారు టోల్ ప్లాజాల వద్ద సమయం వృథా చేసుకోనవసరం ఉండదని వివరించారు. పైగా ఇంధనం కూడా ఆదా అవుతుందని తెలిపారు నితిన్ గడ్కరీ.

 టోల్ ఫీజును ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించడాన్నే ఫాస్టాగ్ గా పిలుస్తారు. దీనిద్వారా టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకెళ్లవచ్చు. ఫాస్టాగ్ వ్యవస్థను దేశంలో 2016లో తీసుకువచ్చారు. 2018 నాటికి 34 లక్షల ఫాస్టాగ్ లు జారీ అయ్యాయి. ఈ ఏడాది నవంబరులో కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో... పాత వాహనాలకు, 2017 డిసెంబరు 1వ తేదీకి ముందు అమ్ముడైన వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. అంతేకాదు, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 ప్రకారం 2017 డిసెంబరు 1 నుంచి నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ లో ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఓ రవాణా వాహనం ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలన్నా ఫాస్టాగ్ కలిగివుండాలన్న నిబంధన విధించారు.

మన వాహనాల విండ్‌స్క్రీన్‌పై ఉంచే ఫాస్టాగ్ స్టిక్కర్ లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది టోల్ ప్లాజాలోని స్కానర్‌కు నేరుగా కనెక్ట్ అవుతుంది. మన ఖాతా నుంచి డబ్బులు ఆటోమెటిగ్గా కట్ అయిపోతాయి. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉంటే తప్ప జనవరి 1 నుంచి అనుమతి ఉండదు. వాలెట్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుకు ఫాస్టాగ్‌ను కనెక్ట్ చేయవచ్చు.FASTag స్టిక్కర్లను NHAI తోపాటు 22 వేర్వేరు బ్యాంకుల నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది పేటీఎం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా లభిస్తుంది.




టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>