MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-mega-hero-sentiment-going-to-work1b94d2d1-9b23-4be3-a34d-675f06cc9ac0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-mega-hero-sentiment-going-to-work1b94d2d1-9b23-4be3-a34d-675f06cc9ac0-415x250-IndiaHerald.jpgమెగా హీరోల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘సుప్రీమ్ హీరో’ సాయి తేజ్. కరోనా కారణంగా కొన్నినెలల పాటు థియేటర్లు బంద్ అయిపోవడంతో వెల వెల బోతున్న సిని పరిశ్రమకు మళ్లీ ఊపిరులు ఊదే బాధ్యతను ఈ హీరో తన భుజాలపై వేసుకున్నాడు. అన్‌లాక్ తర్వాత థియేటర్లకు అనుమతులు వచ్చినా కరోనా భయంతో ఇప్పటి వరకు సినిమాలు ఏవీ విడుదల కాలేదు. megahero;christmas;cinema;film industry;industry;hero;prati roju pandage;supreme;solo bathuke so betterమెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?megahero;christmas;cinema;film industry;industry;hero;prati roju pandage;supreme;solo bathuke so betterThu, 24 Dec 2020 21:05:13 GMTహీరో తన భుజాలపై వేసుకున్నాడు. అన్‌లాక్ తర్వాత థియేటర్లకు అనుమతులు వచ్చినా కరోనా భయంతో ఇప్పటి వరకు సినిమాలు ఏవీ విడుదల కాలేదు. ఎందుకంటే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నిర్మాతలు ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో `సోలో బ్రతుకే సో బెటర్` టీమ్ ధైర్యంగా ముందడుగు వేసింది.  

మెగా హీరో సాయితేజ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందించిన `సోలో బ్రతుకే సో బెటర్` సినిమాసినిమా క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సాయి తేజ్ గట్టి నమ్మకంగా ఉన్నాడు. గత ఏడాది డిసెంబరు‌లో సాయి తేజ్ సినిమా `ప్రతిరోజూ పండగే` విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించింది.

 ఇప్పుడు ఇదే సమయంలో విడుదలవుతున్న ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా కూడా అలాగే భారీ హిట్ గా నిలుస్తుందని సాయి తేజ్, అలాగే చిత్ర బృందం భావిస్తోంది. ఈ నమ్మకం నిజమవ్వాలని చిత్ర బృందం మాత్రమే కాదు పూర్తి తెలుగు సినీ ఇండస్ట్రీనే కోరుకుంటోంది. ఎందుకంటే ఈ సినిమా గనుక హిట్ టాక్ తెచ్చుకుంటే సినీ ఇండస్ట్రీ.. కరోనాను జయించినట్లే. దీంతో మళ్లీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కొత్త జీవం వచ్చినట్లు అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మళ్లీ సినిమా రంగానికి పూర్వ వైభవం రావాలని సినీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.


జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ

తెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటారా..?

ప్రియాంక చోప్రాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం

ఆ రాష్ట్రము లో కర్ఫ్యూ లేదు నిర్ణయం వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

షాకింగ్ : నిమ్మగడ్డ...జగన్ రాజీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>