PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2703d4ba-f362-43fe-a1e0-33731fc75c9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2703d4ba-f362-43fe-a1e0-33731fc75c9a-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, వైఎస్సార్ పార్టీ అధినేత సీఎం జగన్.. ప్రజలను క్షమాపణ కోరారు. కడప జిల్లా పులివెందులలో సభ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సభ వేదికపై నుంచి గండికోట ముంపువాసులను సీఎం జగన్ క్షమాపణ కోరారు. ‘తప్పు చేసి ఉంటే మీ బిడ్డను క్షమించాలి’ అని నమస్కారం పెట్టారు.jagan;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;district;kadapa;cm;chief minister;minister;aqua;gandikota;partyబహిరంగ సభలో క్షమాపణ చెప్పిన సీఎం జగన్!బహిరంగ సభలో క్షమాపణ చెప్పిన సీఎం జగన్!jagan;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;district;kadapa;cm;chief minister;minister;aqua;gandikota;partyThu, 24 Dec 2020 20:32:55 GMTఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, వైఎస్సార్ పార్టీ అధినేత సీఎం జగన్.. ప్రజలను క్షమాపణ కోరారు. కడప జిల్లా పులివెందులలో సభ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సభ వేదికపై నుంచి గండికోట ముంపువాసులను సీఎం జగన్ క్షమాపణ కోరారు. ‘తప్పు చేసి ఉంటే మీ బిడ్డను క్షమించాలి’ అని నమస్కారం పెట్టారు. ‘‘మీ త్యాగం వల్లే గండికోట రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగాం’’ అని చెప్పారు. ఇక్కడి ప్రజల త్యాగంతోనే లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందుతున్నాయని ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.

గండికోట రిజర్వాయర్‌లో ఏనాడూ 12 టీఎంసీల నీటి నిల్వ మించలేదని, ఆ రికార్డును ఇప్పుడు అధిగమించామని వెల్లడించారు. చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ప్రాజెక్టులు పూర్తి చేయగలరని, అది ఉంది కాబట్టే 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి చూపించామని జగన్‌ స్పష్టం చేశారు. గండికోట రిజర్వాయర్‌ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ఎప్పుడూ 12 టీఎంసీలకు మించి నీరు నిల్వ ఉండలేదు. అలాంటిది ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇక్కడి నీటి మట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో ఈ రిజర్వాయరు నీటితో తొణికిసలాడుతోంది. 2013లో మొదటిసారిగా ఈ ప్రాజెక్టును 3 టీఎంసీల నీటితో నింపారు. ఆ తర్వాత 2016లో 5.5 టీఎంసీలు, 2017లో 8.2 టీఎంసీలు, 2018లో 12 టీఎంసీలు, 2019లో 12 టీఎంసీల నీటిని నింపారు. అలాంటిది ఈ ఏడాది రికార్డు స్థాయిలో 26.85 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

అయితే గండికోట రిజర్వాయర్‌ ఇలా నింపడంతో చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. గండికోట ప్రాజెక్టులో 23 టీఎంసీల నీళ్లు నింపాలని జగన్ గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలతో కడప జిల్లా కొండాపురం మండలం, తాళ్లప్రొద్దుటూరు గ్రామాలు నీట మునిగాయి. తమకు పునరావాసం కల్పించకుండా గ్రామాన్ని వదిలేదని ఇక్కడి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత దాదాపు నెల రోజులకు ప్రభుత్వం కదిలిది. తాళ్ల ప్రొద్దుటూరు గ్రామ ప్రజలకు పునరావాసం కల్పించింది. ఇప్పటికీ గండికోట ముంపు బాధితుల్లో కొందరికి పరిహారం అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ

తెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటారా..?

ప్రియాంక చోప్రాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం

ఆ రాష్ట్రము లో కర్ఫ్యూ లేదు నిర్ణయం వెనక్కి తీసుకున్న ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>