PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi5c656fa9-334c-429a-abae-0138d7fa272c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi5c656fa9-334c-429a-abae-0138d7fa272c-415x250-IndiaHerald.jpgమోడీ అంటేనే అదో మోజు. ఆయన ఒక్క ఎన్నికలో కూడా పరాజయం పాలు కాలేదు. మోడీ గుజరాత్ ని మూడు సార్లు తాను సీఎం గా ఉంటూ గెలిపించుకున్నారు. అంతకు మూదూ తరువాత కూడా ఆయన గుజరాత్ ని పలుమార్లు తన సారధ్యంలో గెలిపించారు. ఇపుడు కేంద్రంలో రెండు సార్లు బీజేపీకి ఫుల్ మెజారిటీ సాధించి సత్తా చాటారు. ఇక అందరి ఆలోచనలూ కూడా వచ్చే ఎన్నికల మీదనే సాగుతున్నాయి. మోడీ హ్యాట్రిక్ కొడతారా అన్న దాని మీదనే చర్చలు కూడా సాగుతున్నాయి. modi;modi;soniagandhi;kirti;tara;gujarat - gandhinagar;congress;media;prime minister;minister;doctor;letter;central government;partyమళ్ళీ మోడీయేనట... కాంగ్రెస్ నేత జోస్యంమళ్ళీ మోడీయేనట... కాంగ్రెస్ నేత జోస్యంmodi;modi;soniagandhi;kirti;tara;gujarat - gandhinagar;congress;media;prime minister;minister;doctor;letter;central government;partyThu, 24 Dec 2020 10:00:00 GMTమోడీ అంటేనే అదో మోజు. ఆయన ఒక్క ఎన్నికలో కూడా పరాజయం పాలు కాలేదు. మోడీ గుజరాత్ ని మూడు సార్లు తాను సీఎం గా ఉంటూ గెలిపించుకున్నారు. అంతకు మూదూ తరువాత కూడా ఆయన గుజరాత్ ని పలుమార్లు తన సారధ్యంలో గెలిపించారు. ఇపుడు కేంద్రంలో రెండు సార్లు బీజేపీకి ఫుల్ మెజారిటీ సాధించి సత్తా చాటారు. ఇక అందరి ఆలోచనలూ కూడా వచ్చే ఎన్నికల మీదనే సాగుతున్నాయి. మోడీ హ్యాట్రిక్ కొడతారా అన్న దాని మీదనే చర్చలు కూడా సాగుతున్నాయి.

అయితే మోడీ కచ్చితంగా మరోసారు ప్రధాని కుర్చీని అధిరోహిస్తారు అని బీజేపీకి చెందిన నేతలు ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే అది వారి పార్టీ కాబట్టి అలా చెబుతారు అని అనుకున్నా కూడా సోనియా గాంధీకి వీర విధేయుడిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత. తెలంగాణాకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ శకర్ రావు ఈ విధంగా చెప్పడం మాత్రం చిత్రాతిచిత్రమే.

ఆయన చాన్నాళ్ళ తరువాత మీడియా ముందుకు వచ్చి పెట్టిన ముచ్చట్లు భలే ఆసక్తిగా ఉన్నాయి. మోడీ ఈ దేశానికి చాలా చేశారంటూ ఈ కాంగ్రెస్ నేత కీర్తించడమే విశేషం. అంతే కాదు. ఆయన కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నారని, అందువల్లనే దేశంలో కరోనా పెద్దగా విస్తరించలేదని అన్నారు. ఇది ఒక డాక్టర్ గా తాను చెబుతున్న మాట అని కూడా సర్టిఫై చేశారు.

దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రధానిగా మోడీ ఒక  గాడిన పెడుతున్నారని, ఇతర దేశాలతో రిలేషన్స్ బాగా మెయిన్ టెయిన్ చేస్తున్నారని కూడా శంకరరావు అన్నారు. మోడీకి భారత రత్న కూడా ఇవాలని కోరుతూ తాను రాష్ట్రపతికి లేఖ రాశానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోడీ మళ్ళీ గెలిచి ప్రధాని కావడం ఖాయమని కూడా శంకరరావు మాట్లాడారు. మొత్తానికి కాంగ్రెస్ నేతగా ఉంటూ ఇలా మోడీకి కితాబులు ఇవ్వడం శంకరరావు స్పెషాలిటీ అనుకోవాలేమో.






చంపుతున్న చలికి కారణం అదే ...!?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>