PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-high-court-shocks-yellow-batch-on-three-capitals-and-guest-house-construction-cases0e05f3b7-f693-48ce-b0b1-4daab2afcf86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-high-court-shocks-yellow-batch-on-three-capitals-and-guest-house-construction-cases0e05f3b7-f693-48ce-b0b1-4daab2afcf86-415x250-IndiaHerald.jpgఇరు పక్షాలు ఏ మాత్రం పట్టు విడువకుండా కొనసాగిస్తున్న వివాదంపై ఏపీ హైకోర్టు తాజాగా సూచనలు చేసింది. స్థానిక ఎన్నికలు నిర్వహించడం విషయమై ఇటు ప్రభుత్వం, అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్చించుకోవాల్సిందిగా హితవు పలికింది. ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ విధుల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలిపింది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్, కరోనా తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఆ ఎన్నికలు ఇప్పట్లో జరుపలేమని రాష్ట్ర ప్రభుత్వం కొద్దికాలంగా వాదిస్తున్న విషయం తెలిసిందే.panchayit elections;andhra pradesh;government;court;tamilnadu;letter;local language;election commissionసమరమా...సహకారమా?: స్థానికంపై ఇరుపక్షాల దారెటు?సమరమా...సహకారమా?: స్థానికంపై ఇరుపక్షాల దారెటు?panchayit elections;andhra pradesh;government;court;tamilnadu;letter;local language;election commissionThu, 24 Dec 2020 10:00:00 GMTఇరు పక్షాలు ఏ మాత్రం పట్టు విడువకుండా కొనసాగిస్తున్న వివాదంపై ఏపీ హైకోర్టు తాజాగా సూచనలు చేసింది. స్థానిక ఎన్నికలు నిర్వహించడం విషయమై ఇటు ప్రభుత్వం, అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్చించుకోవాల్సిందిగా హితవు పలికింది. ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ విధుల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలిపింది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్, కరోనా తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఆ ఎన్నికలు ఇప్పట్లో జరుపలేమని రాష్ట్ర ప్రభుత్వం కొద్దికాలంగా వాదిస్తున్న విషయం తెలిసిందే.


పంచాయితీ ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ని కొట్టివేయాల్సిందిగా ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో చర్చలు జరపాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి హై కోర్టు సూచించింది. ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాకి తగ్గని ఇద్దరు లేదా ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. కోర్టు ఉత్తర్వులు అందిన మూడు రోజుల్లోగా ఈ కమిటీతో సమావేశమయ్యే వేదికను స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించాల్సి ఉంటుందని తెలియచేసింది. 


ఎన్నికల నిర్వహణకు గల అభ్యంతరాలను, కరోనా వాక్సినేషన్ కి సంబంధించిన వివరాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఈ కమిటీ చెప్పాలని సూచించింది. అదే సమయంలో స్థానిక ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాల్సిన అవసరాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలియచేయాల్సి ఉంటుంది. 


సంప్రదింపులు ద్వారా సమస్య పరిష్కరించుకోవాల్సిందిగా హై కోర్టు సూచించింది. ఈ ప్రతిపాదనకు ఇరు పక్షాల న్యాయవాదులు అంగీకారం తెలిపారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. సమన్వయము, సహకారం అందించే సుహృద్భావ వాతావరణం ఉందా? అనేదే ఇక్కడి ప్రశ్న. స్థానిక ఎన్నికలు మధ్యలో ఉండగానే కరోనా ఉందంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆరువారాలపాటు ఎన్నికలను వాయిదా వేసింది. దాంతో, ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పై మాటల దాడిని ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలంతా సంధించారు. 


తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెబుతుంటే ప్రభుత్వం కరోనా సాకుగా చూపించి ససేమిరా అంటోంది. అంతకు ముందే...స్టేట్ ఎలక్షన్ కమిషనర్  పదవి కాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చి మరీ తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తి కనగ రాజు ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దానిపై కోర్టుకు వెళ్లిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి అనుకూలంగా తీర్పు వెలువడింది. దాంతో, మధ్యలో ఆగిపోయిన పంచాయితీ ఎన్నికలను నిర్వహిస్తామంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం...ప్రభుత్వం అంగీకరించకపోవడం కూడా తెలిసిందే. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇరు పక్షాలను కూచుని మాట్లాడుకోవాల్సిందిగా సూచించింది. విషయం తేలాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. 



చంపుతున్న చలికి కారణం అదే ...!?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>