MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/to-impress-the-northern-audience5466d703-64b5-4289-9c98-d03e9aa93748-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/to-impress-the-northern-audience5466d703-64b5-4289-9c98-d03e9aa93748-415x250-IndiaHerald.jpgతెలుగువాళ్లు బాలీవుడ్‌కి వెళ్లడం పెద్ద విషయంలా చూస్తుంటారు. ఇక్కడ భారీ బ్లాక్‌బస్టర్స్‌ ఉన్నోళ్లకే హిందీలో ఆఫర్స్‌ వస్తుంటాయని అంతా అనుకుంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం తెలుగులో పెద్దగా హిట్స్‌లేకపోయినా ముంబయి వెళ్తున్నారు. నార్త్‌ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చెయ్యడానికి స్కెచ్చులేస్తున్నారు. to impress the northern audience;akshay;ashok;bellamkonda sai sreenivas;srinivas;sujeeth;mumbai;cinema;telugu;saaho;hindi;remake;horror;press;jaggery;hero;chatrapathi;bhagamathiఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి..!ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి..!to impress the northern audience;akshay;ashok;bellamkonda sai sreenivas;srinivas;sujeeth;mumbai;cinema;telugu;saaho;hindi;remake;horror;press;jaggery;hero;chatrapathi;bhagamathiWed, 23 Dec 2020 23:00:00 GMTముంబయి వెళ్తున్నారు. నార్త్‌ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చెయ్యడానికి స్కెచ్చులేస్తున్నారు.

సుజిత్‌ 'లూసిఫర్' రీమేక్ నుంచి బయటకొచ్చాక మరో తెలుగు సినిమా చేయలేదు. యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా డైరెక్ట్ చేస్తాడనే టాక్ వచ్చినా, హీరో మాత్రం కన్ఫార్మ్ కాలేదు. ప్రభాస్‌తో లార్జ్‌ స్కేల్‌లో తీసిన 'సాహో'కి మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో, సుజిత్‌ని చాలామంది హీరోలు లైట్‌ తీసుకుంటున్నారట. దీంతో తెలుగు స్టార్స్‌తో పెట్టుకుంటే పనవ్వడం లేదని ముంబయి ఫ్లైట్ ఎక్కేశాడు.

'యురి'తో సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకున్న విక్కీ కౌశల్‌తో సుజిత్‌ ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. 'సాహో'కి తెలుగులో మిక్స్‌డ్‌ రిజల్ట్ వచ్చినా, హిందీలో భారీ వసూల్లు వచ్చాయి. సుజిత్‌ డైరెక్షన్‌కి పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో సుజిత్‌తో సినిమా చేసేందుకు విక్కీ కౌశల్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వస్తోంది.

సుజిత్ తర్వాత 'లూసిఫర్' రీమేక్‌లోకి వచ్చిన వినాయక్ కూడా ముంబాయి వెళ్తున్నాడు. 'లూసిఫర్' స్క్రిప్ట్ మొదలుపెట్టి, ఆ తర్వాత బయటకు వచ్చిన వినాయక్ ఇప్పుడు 'ఛత్రపతి'ని హిందీలో తీస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'ఛత్రపతి'ని రీమేక్ చేస్తున్నాడు వినాయక్.

చాలామంది డైరెక్టర్లు రీమేక్‌ సినిమాలతో బాలీవుడ్‌కి వెళ్తున్నారు. తెలుగులో తీసిన హిట్‌మూవీస్‌ని హిందీకి తీసుకెళ్తున్నారు. అయితే కొంతమంది దర్శకులు ఇక్కడ అప్ అండ్‌ డౌన్స్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌కి వెళ్తే, అక్కడా నెగటివ్‌ రిజల్ట్ వచ్చింది. కెరీర్‌ని మరింత ప్రాబ్లమ్స్‌లో పడేసింది.

అనుష్కతో హర్రర్ మూవీ 'భాగమతి' తీసిన అశోక్, ఈ రీమేక్‌తోనే బాలీవుడ్‌కి వెళ్లాడు. అక్షయ్ కుమార్‌ నిర్మాణంలో 'భాగమతి'ని 'దుర్గామతి'గా రీమేక్ చేశాడు. భూమి పడ్నేకర్‌ లీడ్‌ క్యారెక్టర్ ప్లే చేసింది. అయితే తెలుగులో తీసిన కథని సేమ్‌ ఫ్లేవర్‌తో తెరకెక్కించినా హిందీ జనాలకి పెద్దగా నచ్చలేదు. అశోక్‌ హారర్ స్టోరీని రిజక్ట్ చేశారు.





అరియానాకు హీరోయిన్ ఆఫర్స్..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>