PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-21f6d4604-0f43-4401-af29-7d8bd697aa0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-21f6d4604-0f43-4401-af29-7d8bd697aa0e-415x250-IndiaHerald.jpgభారత్ లో కొత్తరకం కొవిడ్ కేసులు లేవని ప్రభుత్వం బల్లగుద్ది చెబుతున్నా కూడా.. ప్రజల్లో భయాందోళనలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ నుంచి వస్తున్న వారికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం, ఆ వైరస్ కొత్తరకమా లేదా అని తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన వారిలో మొత్తం 25మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారికి సోకింది జన్యు మార్పిడి చెందిన వైరస్సా.. లేదంటే పాతదేనా అనే సంగతి నిర్ధరించడానికి అయా రాష్ట్రాల నుంచి బాధితులcovid-2;santoshi;mumbai;india;ahmedabad;london;december;septemberఆ 25మంది వల్లే భారత్ లో కరోనా-2ఆ 25మంది వల్లే భారత్ లో కరోనా-2covid-2;santoshi;mumbai;india;ahmedabad;london;december;septemberWed, 23 Dec 2020 07:00:00 GMTభారత్ లో కొత్తరకం కొవిడ్ కేసులు లేవని ప్రభుత్వం బల్లగుద్ది చెబుతున్నా కూడా.. ప్రజల్లో భయాందోళనలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ నుంచి వస్తున్న వారికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం, ఆ వైరస్ కొత్తరకమా లేదా అని తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన వారిలో మొత్తం 25మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారికి సోకింది జన్యు మార్పిడి చెందిన వైరస్సా.. లేదంటే పాతదేనా అనే సంగతి నిర్ధరించడానికి అయా రాష్ట్రాల నుంచి బాధితుల నమూనాలను పుణె లోని నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు.
బ్రిటన్‌ లో సెప్టెంబర్ నుంచే కొత్త రకం వైరస్ వచ్చిందన్న వార్తలు ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం ఇప్పటికే చాలామంది సెప్టెంబర్ తర్వాత భారత్ కు వచ్చారు. మరి వారందరికీ కరోనా టైప్-2 ఉండే ఉంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా టెస్ట్ లు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ నేపథ్యంలో నేటినుంచి డిసెంబర్ 31వరకు బ్రిటన్ నుంచి భారత్ వచ్చే విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇతర దేశాల ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించారు.

లండన్‌ నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురికి కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. లండన్‌ నుంచి కోల్ ‌కత వచ్చినవారిలో ఇద్దరికి కరోనా ఉంది. లండన్ నుంచి అహ్మదాబాద్ వచ్చినవారిలో ఐదుగురికి కరోనా వచ్చింది. ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏంటంటే.. బ్రిటన్‌ నుంచి మూడు విమానాల్లో 590 మంది ప్రయాణికులు మంగళవారం ముంబై చేరుకున్నారు. వారిలో 187 మంది ముంబైవాసులు కాగా.. 167 మంది మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు,  మిగిలినవారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో ఏ ఒక్కరికీ కొవిడ్ లక్షణాలు లేవు. ప్రస్తుతం లండన్ నుంచి వచ్చిన ఆ 25మందితోనే అసలు సమస్య అని అంటున్నారు. పుణె ల్యాబ్ రిపోర్ట్ లు వచ్చిన తర్వాతే భారత్ కి రెండోరకం కరోనా వచ్చిందా లేదా అనే విషయం నిర్థారణ అవుతుంది. అప్పటి వరకు ఆ 25మందిని క్వారంటైన్ లో ఉంచబోతున్నారు.


ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా స్టార్ట్ చేశాడా..?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>