PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/singarenicmd641f8181-c49f-410f-b1a7-25a0a372c664-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/singarenicmd641f8181-c49f-410f-b1a7-25a0a372c664-415x250-IndiaHerald.jpgసింగరేణికి మరో వందేళ్ల భవిష్యత్ ఉంటుందని సీఎండీ శ్రీధర్ అన్నారు. సింగరేణి 131వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, కార్మికులకు సంస్థ సీఎండీ శ్రీధర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ నిర్ధేశించుకున్న లక్ష్యాలు సాధిస్తున్న కార్మికులను అభినందించారు. దేశంలో బొగ్గుతోపాటు థర్మల్‌, సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ సింగరేణి మాత్రమేనని చెప్పారు. సమిష్టి కృషితో సింగరేణికి మరో వందేండ్ల సుస్థిర భవిష్యత్‌ ఉంటుందన్నారు. ప్రస్తుతం 45,131 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఏడాది 64 మిలియన్‌ టన్నులsingarenicmd;sridhar;cm;central governmentసింగరేణికి మరో వందేళ్ల భవిష్యత్సింగరేణికి మరో వందేళ్ల భవిష్యత్singarenicmd;sridhar;cm;central governmentWed, 23 Dec 2020 13:21:59 GMTసింగరేణికి మరో వందేళ్ల భవిష్యత్

సీఎండీ శ్రీధర్ 

సింగరేణికి మరో వందేళ్ల భవిష్యత్ ఉంటుందని సీఎండీ శ్రీధర్ అన్నారు.   సింగరేణి 131వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, కార్మికులకు సంస్థ సీఎండీ శ్రీధర్‌ శుభాకాంక్షలు తెలిపారు.   సంస్థ నిర్ధేశించుకున్న లక్ష్యాలు సాధిస్తున్న కార్మికులను అభినందించారు.  దేశంలో బొగ్గుతోపాటు థర్మల్‌, సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ సింగరేణి మాత్రమేనని చెప్పారు. సమిష్టి కృషితో సింగరేణికి మరో వందేండ్ల సుస్థిర భవిష్యత్‌ ఉంటుందన్నారు.   ప్రస్తుతం 45,131 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఏడాది 64 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థ రూ.27 వేల కోట్ల బొగ్గును విక్రయించిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.7 వేల కోట్ల పన్ను చెల్లిస్తున్నది.

కాగా సింగరేణి ఆవిర్భావ ఉత్సవాలు అన్ని ఏరియాల్లో  జరుగుతున్నాయి.  కరోనా నేపథ్యంలో బొగ్గు గనులు ఉన్న ఆరు జిల్లాల్లో ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఏరియా జనరల్‌ మేనేజర్లు ఉదయం 9 గంటలకు ఆయా ప్రాంతాల్లో పతాకావిష్కరణ చేశారు.

హైదరాబాద్‌ దక్కన్‌ కంపెనీగా ఉన్న సింగరేణి అనంతరం  సింగరేణి కాలరీస్‌ ఆవిర్భవించి నేటితో వందేండ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ దక్కన్‌ కంపెనీ 1889లో ఇల్లెందులో వద్ద తొలిసారిగా బొగ్గును ఉత్పత్తి చేసింది. అయితే 1920లో సింగరేణి కాలరీస్‌గా అవతరించింది. సింగరేణి కాలరీస్‌లో నిజాం షేర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1945లో తొలి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి కాలరీస్‌ ఆవిర్భవించింది.


 


పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లి

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>