Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sudh-about-farmers417da43c-c748-4c41-a5ce-3b7a6fd5c931-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sudh-about-farmers417da43c-c748-4c41-a5ce-3b7a6fd5c931-415x250-IndiaHerald.jpgకోవిడ్‌ ప్రభావిత సమయంలో ఇబ్బందులు పడుతున్న ఎందరికో అండగా నిలబడి రియల్‌ హీరోగా మారారు బాలీవుడ్ నటుడు సోనూసూద్‌. ఈ యాక్టర్‌ క్రేజ్‌ చూసి ఇప్పుడు స్టార్‌ హీరోలు కూడా అతన్ని విలన్‌గా పెట్టుకోవాలంటే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఏకంగా సోనూసూద్‌ స్వయంగా చెప్పినా వినకుండా ప్రజలు అతనికి గుడిని కట్టేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణకు చెందిన ఓ అభిమాని సోను కు గుడి కట్టేశాడు. గుడిsonu;chiranjeevi;prema;vedhika;telangana;bollywood;temple;love;aqua;local languageతన విగ్రహం గురుంచి స్పందించిన సోనూ సూద్.. ఏమన్నాడో తెలుసా.?తన విగ్రహం గురుంచి స్పందించిన సోనూ సూద్.. ఏమన్నాడో తెలుసా.?sonu;chiranjeevi;prema;vedhika;telangana;bollywood;temple;love;aqua;local languageWed, 23 Dec 2020 09:30:00 GMTగుడి కట్టేశాడు. గుడి కట్టేయడమే కాదు.. ఏకంగా పూజలు కూడా చేసేస్తున్నాడు.  తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు మండలానికి చెందిన దుబ్బ తండా పరిధిలోని చెలిమి తండాకు చెందిన రాజేశ్‌ రాథోడ్‌ సోనూసూద్‌ విగ్రహం ఏర్పాటు చేశాడు. రాజేశ్‌ తన సొంత ఖర్చుతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. సోనూసూద్‌కు రాజేశ్‌ రాథోడ్‌ అభిమాని.


 సినిమాలు చూసిన అతని నటన ఇష్టపడ్డ రాజేశ్‌ .. కోవిడ్ సమయంలో సోనూ చేసిన సర్వీస్‌ చూసి అతనికి వీరాభిమాని అయిపోయాడు. తన అభిమాన నటుడికి ఏదో ఒకటి చేయాలని చాలా ఆలోచించి   ఏకంగా గుడి కట్టేశాడు. రాజేశ్‌ స్నేహితులు, చుట్టుపక్కల ఉండేవారు, స్థానికులు కూడా అతన్ని ఎంకరేజ్‌ చేశారు. గుడి కట్టిన తర్వాత స్థానికులు ముందుకు వచ్చి విగ్రహానికి బొట్టు పెట్టి పూజలు నిర్వహించడం విశేషం. సోనూసూద్‌కి అభిమాని గుడి కట్టిన విషయం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీనిపై సోనూసూద్‌ కూడా స్పందించాడు.


కాగా, ఈ విషయం కాస్తా నటుడు సోనూసూద్‌కు చేరింది. దీనిపై ఆయన సోషల్  వేదిక గా స్పందించారు. తనకు ఇలా విగ్రహం ఏర్పాటుచేయడం గౌరవంగా ఉందన్నారు. అయితే, ఇది తన స్థాయికి మించిన గౌరవమని, దీనికి తను అర్హుడును కాదని అన్నారు. నేను ఇలాంటి వాటికి అర్హుడిని కాను' అంటూ వినమ్రంగా నమస్కారం ఉన్న సింబల్‌ను పోస్ట్‌ చేశాడు సోనూసూద్‌...విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకు వెళ్లాలని ఉందని,  త్వరలోనే అక్కడకు వెళ్తానని పేర్కొన్నారు. రెండు చేతులు జోడించి గ్రామస్తులు చూపించిన ప్రేమ, గౌరవానికి కృతజ్ఞుడిని అని తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే సోనూసూద్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు..


ప్రశాంత్, ఎన్టీఆర్ ల సినిమా ఉన్నట్లా...లేనట్లా..?

ఏపీ ప్రభుత్వం : ఆన్ లైన్ కాల్ మనీ కేసులపై ఉక్కుపాదం...!

కరోనా టైప్ -2 నేపథ్యంలో తెలంగాణ సంచలన నిర్ణయం..

డాక్టర్లను విడిచిపెట్టని జగన్ ... ! ఇక పల్లెల్లో ఏం చేయబోతున్నారంటే ?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>