PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud8384ade-f7f4-427b-8e16-26ff21705c75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud8384ade-f7f4-427b-8e16-26ff21705c75-415x250-IndiaHerald.jpgరైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పదిమందికి అన్నంపెట్టే రైతన్నలంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటం, రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉండటం విషాదకరం అని ఆయన ఆరోపించారు. మరోవైపు ప్రజా రాజధాని అమరావతి ప్రాంత రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారు అని వెల్లడించారు. వీరిలో 110 మందికి పైగా అన్నదాతలు అమరులయ్యాchandrababu;telugu desam party;amaravati;andhra pradesh;telugu;government;capital;letter;tdp;party;santoshamదాడి చేసారు... చంద్రబాబు ఆవేదనదాడి చేసారు... చంద్రబాబు ఆవేదనchandrababu;telugu desam party;amaravati;andhra pradesh;telugu;government;capital;letter;tdp;party;santoshamWed, 23 Dec 2020 19:10:10 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.  పదిమందికి అన్నంపెట్టే రైతన్నలంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటం, రైతు ఆత్మహత్యల్లో ఏపీ  దేశంలో మూడో స్థానంలో ఉండటం విషాదకరం  అని ఆయన ఆరోపించారు. మరోవైపు ప్రజా రాజధాని అమరావతి ప్రాంత రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారు అని వెల్లడించారు.

 వీరిలో 110 మందికి పైగా అన్నదాతలు అమరులయ్యారు అని ఆయన పేర్కొన్నారు.  ఇంకోవైపు ప్రభుత్వం తన అప్పు పరిధిని పెంచుకోవడం కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుపై మరింత భారం వేయబోతోంది అని మండిపడ్డారు. వరుస వరదలు, భారీవర్షాలు, నివర్ తుపాన్ విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో బైఠాయించి పట్టుబట్టేదాకా పంటబీమా ప్రీమియం కట్టలేదంటే రైతులపట్ల పాలకులకెంత నిర్లక్ష్యమో తెలుస్తోంది అని ఆయన అన్నారు.

పైగా రైతుకు పరిహారం అడిగితే సభలో మాపైనే దాడికి తెగబడ్డారు అని మండిపడ్డారు. ఇకమీదట అయినా పాలకులు తీరు మార్చుకుని .. పంటకు గిట్టుబాటు ధరలు అందించాలని ఆయన పేర్కొన్నారు.  పంట కొనుగోళ్ళలో అవినీతికి స్వస్తి చెప్పాలని, రైతుల బకాయిలు తక్షణమే చెల్లించాలని, విపత్తు పరిహారం, బీమా, ఇన్ పుట్ సబ్సిడీలు సకాలంలో అందించి రైతుల్లో భవిష్యత్ పై భరోసా పెంచాలని  కోరుతున్నా అని అన్నారు చంద్రబాబు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందించాలి అని డిమాండ్ చేసారు.  సబ్సిడీ ఇచ్చి సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలి అని ఆయన సూచించారు. ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు అంటారు అని, పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవు అన్నారు.


మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>