PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pvvardanthic03c1bf6-6d16-4530-a19d-93bf9177b1f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pvvardanthic03c1bf6-6d16-4530-a19d-93bf9177b1f2-415x250-IndiaHerald.jpgపీవీ నర్సింహారావు గొప్ప వ్యక్తి అని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు పేర్కొన్నారు. అయన వర్థంతి సందర్భంగా బుధవారం ఉదయం నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద పలువురు నివాళులర్పించారు. రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కేశవరావు (కేకే), మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆలోచనలు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కpvvardanthi;jayanthi;kavitha;vani;india;rajya sabha;mp;chief minister;reddy;shakti;jayamపీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలిపీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలిpvvardanthi;jayanthi;kavitha;vani;india;rajya sabha;mp;chief minister;reddy;shakti;jayamWed, 23 Dec 2020 11:12:49 GMTపీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలి 

వర్థంతి సందర్భంగా   ప్రముఖుల నివాళి 

పీవీ నర్సింహారావు గొప్ప వ్యక్తి అని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు పేర్కొన్నారు. అయన వర్థంతి సందర్భంగా  బుధవారం ఉదయం  నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద పలువురు నివాళులర్పించారు. రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కేశవరావు (కేకే),  మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు.   ఆయన చేసిన సంస్కరణలు, ఆలోచనలు  దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. పీవీ పేరుతో ఒక తపాల బిళ్లను విడుదల చేయాలని సూచిస్తామని  పేర్కొన్నారు.

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి అని, ఆయన  భౌతికంగా మన మధ్య లేకపోయినా పీవీ ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయన్నారు. దేశానికి దిక్సూచి పీవీ అని, ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం.  

భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన  గొప్ప మహనీయుడు పీవీ నర్సింహారావు. అయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కారక్రమంలో పీవీ కుమార్తె వాణి, కుమారుడు పీవీప్రభాకర్‌ రావు, ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు.  




భారత్ లో మళ్ళి పెరిగిన కరోనా కేసులు ...ఎంతమంది మృతి చెందారంటే ...?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

మెగా హీరో తో కెమిస్ట్రీ బాగుందన్న ఇస్మార్ట్ బ్యూటీ....!?

జ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>