SmaranaSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/smarana/137/national-farmers-day-importancec2cfdf43-ddfc-4d15-9623-f65c143e8a5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/smarana/137/national-farmers-day-importancec2cfdf43-ddfc-4d15-9623-f65c143e8a5d-415x250-IndiaHerald.jpgభారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ జన్మదినమైన డిసెంబరు 23న జాతీయ రైతు దినోత్సవంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జరుపుకుంటాం.. భారతదేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేసిన పలు ఉద్యమాల ఫలితంగా జమీందారీ చట్టం రద్దయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు ఋణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. farmers day;amala akkineni;choudary actor;nithya new;prakruti;varsha;delhi;charan singh;prime minister;december;history;butterడిసెంబర్ 23 - జాతీయ రైతు దినోత్సవ ప్రాముఖ్యతడిసెంబర్ 23 - జాతీయ రైతు దినోత్సవ ప్రాముఖ్యతfarmers day;amala akkineni;choudary actor;nithya new;prakruti;varsha;delhi;charan singh;prime minister;december;history;butterWed, 23 Dec 2020 10:40:00 GMTప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికందకపోతుందా అనే ఆశావాదంతో జీవనం సాగిస్తున్నారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి. ఒకవేళ ప్రకృతి కరుణించి దిగుబడి బాగున్నా పండిన పంటకు సరైన ధరలేక నిస్సహాయుడిగా మిగిలిపోయే పరిస్థితి. దేశాన్ని రక్షించే జవాన్‌లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నకు అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్‌... జై కిసాన్‌ అనే నినాదం పుట్టింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఒక జూదంగా మారింది. ఒక రోజు వర్షాల కోసం.. ఇంకోరోజు విత్తనాల కోసం.. మరో రోజు ఎరువుల కోసం.. బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. ‘రైతు రాజు కాడు... దున్నేవాడిది భూమి కాదు.. వర్షం రాదు, కరువు పోదు.. కష్టం తరగదు, నష్టం తీరదు.. అప్పులు, పేదరికం.. నిరాశ, నిస్సహాయం.. కన్నీళ్ల తడి ఆరదు.. కానీ ఆశ చావదు.. తాను నమ్ముకున్న మట్టి మోసం చేయదని, శరీరాన్ని తాకట్టుపెట్టి, మనసుని బందీ చేసి, ఆత్మని పొలంలోనే పాతిపెట్టే రైతన్న’ఈ రోజున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేసే దుస్థితి నెలకుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరరేకంగా దాదాపు నెల రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయక అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.



ఇక ఈ రైతు దినోత్సవానికి సంబంధించిన చరిత్ర తెలుసుకున్నట్లైతే... భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ జన్మదినమైన డిసెంబరు 23న జాతీయ రైతు దినోత్సవంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జరుపుకుంటాం.. భారతదేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేసిన పలు ఉద్యమాల ఫలితంగా జమీందారీ చట్టం రద్దయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు ఋణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్ల‌మెంట్‌ని ఎదుర్కొలేక‌పోయి తాత్కాలిక ప్ర‌ధానిగానే 1980లోనే ఆయన ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. చ‌ర‌ణ్ సింగ్ రైతు నాయ‌కుడిగానే 1987 మే 29న కన్నుమూశారు. రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన చ‌ర‌ణ్ సింగ్‌ .. రైతుల‌కు చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ఆయ‌న జ‌న్మ‌దినం డిసెంబ‌ర్ 23న కిసాన్ దివ‌స్ జాతీయ రైతు దినోత్స‌వంగా భార‌త దేశంలో జ‌రుపుకొంటారు. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.


మెగా హీరో తో కెమిస్ట్రీ బాగుందన్న ఇస్మార్ట్ బ్యూటీ....!?

జ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!

పంజాబీ వ్యక్తి తో ప్రేమాయణం.. పొట్టకూటి కోసం ఆ పని చేసా..రోజంతా ఏడ్చాను : మయూరి సుధాచంద్రన్

అమ్మో.. ట్రాఫిక్ పోలీసులు... 2 గంటల్లో రూ.29.5 లక్షలు

వాహనదారులకు దిమ్మతిరిగే షాక్.. అలా చేసుకోకుంటే అంతే..?

చిరు ని కలసిన మంచు విష్ణు... కారణం అదేనా..?

ఉత్తరాది గ్యాంగ్స్టర్ లతో అనకాపల్లి, గాజువాకలకు సంబంధం ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>