Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/reason-behind-ntr-is-out-of-events9cb6e8b6-4aca-4fc2-ab58-57152bab6cc6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/reason-behind-ntr-is-out-of-events9cb6e8b6-4aca-4fc2-ab58-57152bab6cc6-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ వేడుకలకు దూరంగా ఉంటున్నాడా..? ఆయన కావాలనే ఫంక్షన్లలో పాల్గొనడం లేదా..? అంటే ఆయన అభిమానుల నుంచి అవుననే టాక్ వినిపిస్తోంది. ఎప్పుడో కొన్ని నెలల క్రితం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కి వెళ్లే సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. దీంతో తమ హీరో కంటికి నలుసైపోయాడంటూ ఫ్యాన్స్ బుంగమూతి...ntr;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;balakrishna;ram charan teja;naga chaitanya;jr ntr;kalyan;kalyan ram;krishna;krishnam raju;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;vijay;hyderabad;tollywood;rrr movie;rajani kanth;marriage;producer;industry;wife;producer1;hero;joseph vijay;nandamuri taraka rama rao;dubai;chaitanya 1;dilయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనపడడం లేదేంటి..?యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనపడడం లేదేంటి..?ntr;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;balakrishna;ram charan teja;naga chaitanya;jr ntr;kalyan;kalyan ram;krishna;krishnam raju;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;vijay;hyderabad;tollywood;rrr movie;rajani kanth;marriage;producer;industry;wife;producer1;hero;joseph vijay;nandamuri taraka rama rao;dubai;chaitanya 1;dilWed, 23 Dec 2020 16:36:49 GMTఇంటర్నెట్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేడుకలకు దూరంగా ఉంటున్నాడా..? ఆయన కావాలనే ఫంక్షన్లలో పాల్గొనడం లేదా..? అంటే ఆయన అభిమానుల నుంచి అవుననే టాక్ వినిపిస్తోంది. ఎప్పుడో కొన్ని నెలల క్రితం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కి వెళ్లే సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. దీంతో తమ హీరో కంటికి నలుసైపోయాడంటూ ఫ్యాన్స్ బుంగమూతి పెట్టుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఇలా కనపడకపోవడంతో ఎవరికి వారు తమకు తోచిన రీతిలో రూమర్లు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కొందరేమో ఎన్టీఆర్ కావాలనే ఇలా అందరికీ దూరంగా ఉంటున్నారని, చెబుతుంటో మరికొందరేమో ఆర్ఆర్ఆర్ సినిమాలో కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడని, అది ఎవరికీ తెలియకుండా ఉండేందుకే ఇలా కెమెరాకు చిక్కకుండా ఉన్నాడని చెవులు కొరుక్కుంటున్నారు.

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలతో పాటు ఇండస్ట్రీలో అనేక ఫంక్షన్లు జరిగాయి. అయితే వీటిలో దేనికీ ఎన్టీఆర్ హాజరు కాలేదు. దిల్ రాజు ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, అక్కినేని నాగచైతన్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు ఇంకా అనేకమంది ఈ పార్టీలో కనిపించారు. కానీ ఎక్కడా తారక్ కనిపించలేదు. దీంతో దిల్‌రాజుకు, ఎన్టీఆర్‌కు మధ్య ఏదో జరిగిందనే రూర్లు కూడా అప్పట్లో వచ్చాయి.

అయితే స్వయానా బాబాయి నందమూరి జయకృష్ణ ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి కూడా ఎన్టీఆర్ కుటుంబ హాజరు కాలేదు. కొద్ది రోజుల క్రితం జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లి జరిగింది. ఈ వివాహానికి బాలకృష్ణ కుటుంబం హాజరైంది. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఇందులో ఎన్టీఆర్ కానీ, ఆయన భార్య లక్ష్మీప్రణతి గానీ కనిపించలేదు. దీంతో వేడుకలకు, పార్టీలకు తారక్ కావాలనే దూరంగా ఉంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇది ఫ్యాన్స్‌ను తెగ బాధిస్తోంది. మరి దీనిపై ఎన్టీఆర్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.


రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?

టాలీవుడ్ లోనే వెయ్యి రోజులకి పైగా ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!

సలార్‌లో హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ ఎవరిని ఎంచుకున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>