MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-the-elder-brother-is-like-that-the-younger-brother-is-like-that-d8883915-06ae-4f04-b283-3745dfef98fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-the-elder-brother-is-like-that-the-younger-brother-is-like-that-d8883915-06ae-4f04-b283-3745dfef98fc-415x250-IndiaHerald.jpgఅన్నయ్యేమో సన్నబడాలని ట్రై చేస్తోంటే, తమ్ముడు మాత్రం బరువు పెరుగుతున్నాడు. పెద్దోడు స్లిమ్‌ అండ్‌ ఫిట్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తోంటే, చిన్నోడు మాత్రం చబ్బీ లుక్‌తో ఎంటర్‌ది డ్రాగన్‌ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ వెయిట్‌ గెయిన్ అండ్ లాస్‌తో అభిమానులని ఆశ్చర్యపరుస్తోన్న ఆ బ్రదర్స్‌ ఎవరో కాదు మెగా సోదరులు. the elder brother is like that the younger brother;pawan;chiranjeevi;nagarjuna akkineni;shiva;kalyan;koratala siva;pawan kalyan;cinema;industry;lord siva;saira narasimhareddy;khaidi.;khaidi new;annayya;mister;journeyఅన్నయ్య అలా.. తమ్ముడు ఇలా..!అన్నయ్య అలా.. తమ్ముడు ఇలా..!the elder brother is like that the younger brother;pawan;chiranjeevi;nagarjuna akkineni;shiva;kalyan;koratala siva;pawan kalyan;cinema;industry;lord siva;saira narasimhareddy;khaidi.;khaidi new;annayya;mister;journeyWed, 23 Dec 2020 22:00:00 GMTమెగాస్టార్ సన్నబడాలని ప్రయత్నం చేస్తోంటే, పవర్ స్టార్ మాత్రం అమాంతం బరువు పెరుగుతున్నాడు. పెద్దోడు స్లిమ్‌ అండ్‌ ఫిట్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తోంటే, చిన్నోడు మాత్రం చబ్బీ లుక్‌తో ఎంటర్‌ది డ్రాగన్‌ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ వెయిట్‌ గెయిన్ అండ్ లాస్‌తో అభిమానులని ఆశ్చర్యపరుస్తోన్న ఆ బ్రదర్స్‌ ఎవరో కాదు మెగా సోదరులు.

చిరంజీవి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి ఇండస్ట్రీ జనాలంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. అరవై అయిదేళ్ల వయసులో కూడా చిరు ఇంత కష్టపడుతున్నాడా, మేకోవర్‌పై ఇంత కేర్‌ తీసుకుంటున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. బిగ్‌బాస్‌-4 ఫైనల్‌ ఎపిసోడ్‌లో మిస్టర్ ఫిట్‌ నాగార్జున కూడా చిరంజీవి కొత్త లుక్ చూసి షాక్ అయ్యాడు. ఇంత సన్నగా ఎలా బాస్ అన్నట్లు ప్రశ్నలేశాడు.

చిరంజీవి 'ఖైదీ నం.150, సైరా' సినిమాల్లో కొంచెం బొద్దుగానే కనిపించాడు. పాలిటిక్స్‌లోకి వెళ్లాక మేకోవర్‌పై అంత ఫోకస్‌ చెయ్యకపోవడంతో చిరు లుక్‌ మారిపోయింది. ఈ మారిపోయిన లుక్‌తోనే రెండు సినిమాలు చేశాడు. అయితే 'ఆచార్య' సినిమాకి మాత్రం చిరంజీవిని పాత లుక్‌లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు కొరటాల శివ. దీంతో చిరు కూడా వెయిట్‌ లాస్ ప్రోగ్రామ్‌ మొదలుపెట్టాడు. ఇప్పుడు చూస్తోన్న లుక్‌లోకి వచ్చేశాడు.

అన్నయ్య చిరంజీవి స్లిమ్‌గా మారిపోతే, తమ్ముడు పవన్‌ కళ్యాణ్ మాత్రం కొంచెం చబ్బీగా తయారయ్యాడు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌ లాంచింగ్‌లో పవన్ కొంచెం చబ్బీగా కనిపించాడు. దీంతో పవర్‌స్టార్‌ మళ్లీ పాత లుక్‌లోకి వచ్చేశాడని సంబరపడిపోతున్నారు పవన్‌ ఫ్యాన్స్.

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు లేకపోతో లుక్‌ గురించి పెద్దగా పట్టించుకోనని చాలా సార్లు చెప్పాడు. అయితే ఇప్పుడు 'వకీల్‌సాబ్'తో పవన్‌ మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ఇక సినిమా స్టార్ కమ్ పొలిటీషియన్‌గా జర్నీ చేస్తోన్న పవన్ మళ్లీ మేకోవర్‌పై ఫోకస్ పెట్టాడు. ఫ్యాన్స్‌ కోరుకుంటోన్న కథలతోపాటు, లుక్‌ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. మొత్తానికి అన్నయ్య బరువు తగ్గుతుంటే.. తమ్ముడు మాత్రం వెయిట్ అమాంతం పెరిగిపోతున్నాడు.






ప్రాంతీయ పార్టీలకు కొత్త సవాల్...బెంగాల్ ఎన్నికలు ?

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>