MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-rajiniknath-daily-getup-changingb938fc7d-f1a1-4011-b328-a1a2b1ba2e8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-rajiniknath-daily-getup-changingb938fc7d-f1a1-4011-b328-a1a2b1ba2e8a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ గురించి పరిచయం ఇవ్వడం అంటే ఆయన్ని అవమానించడమే. ఇండియన్ సినిమా హిస్టరీలో హీరోలు అందరికీ కొన్ని పేజీలు ఉంటాయి. మిగతా బుక్ అంతా రజనీ గురించే ఉంటుంది. అదీ రజనీకాంత్ రేంజ్. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా మన అందరికీ తెలిసిందేrajinikanth;rajinikanth;tiru;రాజీనామా;cinema;rajani kanth;conductor;success;allu sneha;indian;k balachanderరజనీకాంత్ ప్రతి రోజు మారు వేషాలు వేయాల్సిందే..ఎందుకో తెలుసా..?రజనీకాంత్ ప్రతి రోజు మారు వేషాలు వేయాల్సిందే..ఎందుకో తెలుసా..?rajinikanth;rajinikanth;tiru;రాజీనామా;cinema;rajani kanth;conductor;success;allu sneha;indian;k balachanderWed, 23 Dec 2020 12:00:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ గురించి పరిచయం ఇవ్వడం అంటే ఆయన్ని అవమానించడమే. ఇండియన్ సినిమా హిస్టరీలో హీరోలు అందరికీ కొన్ని పేజీలు ఉంటాయి. మిగతా బుక్ అంతా రజనీ గురించే ఉంటుంది. అదీ రజనీకాంత్ రేంజ్. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా మన అందరికీ తెలిసిందే. పొరపాటున ఎప్పుడైనా ఆయన రోడ్డు మీదకి వస్తే.., ఆ రోజంతా ఆ ఏరియా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని పోవాల్సిందే. మరి.., ఇంతటి సూపర్ స్టార్ రోడ్డు మీదకి వచ్చి బజ్జీలు తింటాడు మీకు తెలుసా? కాకా హోటల్ లో చాయ్ తాగేస్తాడు. పబ్లిక్ పార్క్ లో కూర్చొని దోశెలు కూడా తినేస్తాడు. ఒక సూపర్ స్టార్ కి ఇవన్నీ ఎలా సాధ్యం అంటారా? మన సూపర్ స్టార్ మారు వేషాలు వేసుకుని బెంగుళూరు వీధుల్లో తిరుగుతాడు. ఆయన కోరుకుంటే ఏదైనా.. కాళ్ళ వద్దకి వస్తుంది. అలాంటి సూపర్ స్టార్ కి రోడ్డు మీద తిరగాల్సిన అవడసరం ఏముంది అంటారా? అంతా స్నేహం కోసం. అవును.. రజనీ కాంత్ ముందుగా ఒక బస్ కండక్టర్. ఆయన స్నేహితుడు రజనీని ప్రోత్సహించి నటన వైపు నడిపించారు. ఆ స్నేహితుడు పేరు రాజ బహుదూర్. రజనీ బస్ కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళాక.., ఆయన ఖర్చులు అన్నీ ఈ స్నేహితుడే పెట్టుకుంటూ వచ్చాడు. అప్పట్లోనే  నెలకి 500 రూపాయలు ఖర్చుకి పంపేవాడు. ఎప్పుడైనా తాను డబ్బులు పంపడం ఆలశ్యం అయితే ఈ చైన్ వాడుకొమ్మని తన  బంగారం చైన్ కూడా రజనీకే ఇచ్చేశాడు రాజబహుదూర్. తర్వాత రజనీ టైమ్ బాగుండి.. బాలచందర్ చేతిలో పడ్డాడు. తరువాత వరుసగా సూపర్ సక్సెస్ లు కొట్టాడు. అందరూ చూస్తుండగానే ఎవ్వరికీ అందకుండా సూపర్ స్టార్ అయ్యాడు. ఒకే ఒక వ్యక్తికి మాత్రం అందాడు. ఆయన స్నేహితుడు రాజబహుదూర్ కి మాత్రం అందాడు. ఇప్పటికీ వారిది అదే స్నేహం. రజనీ బెంగుళూరు వెళ్లిన ప్రతిసారి తన స్నేహితుడిని కలుసుకుంటాడు. వెంటనే మారు వేషం వేసేస్తాడు. ఎవ్వరూ తనని  గుర్తుపట్టకుండా.. రోడ్ల మీద తిరుగుతూ ఇష్టం వచ్చింది తినేస్తాడు. దారిలో ఎవరైనా కష్టపడుతూ కనిపిస్తే లక్షలకి లక్షలు దానాలు చేసేస్తాడు. తాను ఎవరు మాత్రం చెప్పకుండా.., స్నేహితుడితో కలసి అలా నడువ్చుకుంటూ వెళ్లిపోతుంటాడు. చూశారు కదా ఇది రజనీకాంత్ అంటే.  


సోషల్ మీడియాలో వైరలవుతున్న ఎన్టీఆర్ మనవడి పెళ్లిఫోటోలు!

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>