Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/agri-gold6249a30f-7691-4434-ae9c-3f6f45628ad2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/agri-gold6249a30f-7691-4434-ae9c-3f6f45628ad2-415x250-IndiaHerald.jpgలక్షల మంది బాధితులు.. వేల కోట్ల రూపాయల మోసం.. ఇదీ అగ్రిగోల్డ్ చరిత్ర. ఈ కేసులో దాదాపు కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. కానీ బాధితుల ఆవేదన మాత్రం తీరడం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ప్రజలను నట్టేట ముంచిన ఈ కేసులో ఓ కీలక మలుపు నేడు(బుధవారం) చోటుచేసుకుంది. ఈ కేసులో చాలా రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ముగ్గురు కీలక నిందితులను....agri gold;hema;tiru;amaravati;andhra pradesh;karnataka - bengaluru;telangana;police;court;karnataka 1;history;tamilnadu;arrest;agrigoldఅగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్agri gold;hema;tiru;amaravati;andhra pradesh;karnataka - bengaluru;telangana;police;court;karnataka 1;history;tamilnadu;arrest;agrigoldWed, 23 Dec 2020 16:16:00 GMTఅమరావతి: లక్షల మంది బాధితులు.. వేల కోట్ల రూపాయల మోసం.. ఇదీ అగ్రిగోల్డ్ చరిత్ర. ఈ కేసులో దాదాపు కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. కానీ బాధితుల ఆవేదన మాత్రం తీరడం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ప్రజలను నట్టేట ముంచిన ఈ కేసులో ఓ కీలక మలుపు నేడు(బుధవారం) చోటుచేసుకుంది. ఈ కేసులో చాలా రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ముగ్గురు కీలక నిందితులను ఈ రోజు అరెస్టు చేసింది. ఈ ముగ్గురిలో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు అవ్వా వెంకట శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్‌లు ఉన్నారు. మనీలాండరింగ్ అభియోగాల నేపథ్యంలో వీరిని అదుపులోనికి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వేల కోట్ల మనీల్యాండరింగ్‌, హవాల ఆరోపణలలు వీరిపై ఉన్నాయని, ఆ కేసుల విచారణలో భాగంగానే అరెస్టు చేయడం జరిగిందని చెప్పింది.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల మందిని అగ్రిగోల్డ్ మోసం చేసింది. వీరిపై మొత్తం రూ. 6,380 కోట్ల మేర మోసాలు చేసినట్లు కేసులున్నాయి. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులు, ఛార్జిషీట్ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విభాగం కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతో వీరు కూడబెట్టుకున్న ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది.

ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఆస్తుల కొనుగోలు జరిగిందో ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే రామారావు, శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్‌లను ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత వారిని అదుపులోనికి తీసుకుంది. ఈ రోజు సాయంత్రం ముగ్గురినీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న సంస్థ వైస్ చైర్మన్ అవ్వా సీతారామారావును పోలీసులు ఈ ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీలో అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావుకు ఈయన స్వయానా తమ్ముడు.


ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అగ్రిగోల్డ్ సంస్థ లక్షల మందిని మోసం చేసింది. తమ వద్ద డబ్బు డిపాజిట్ చేస్తే.. అధికశాతం వడ్డీలు చెల్లిస్తామని నమ్మబలికింది. కానీ సమయానికి తిరిగి చెల్లించాల్లించలేదు. దీంతో డబ్బు దాచుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భారగా పోలీసు కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ చేశారు. ఆ తరువాత కేసు సీఐడీకి బదిలీ చేశారు. సంపాదించిన డబ్బంతా ఇందులో దాచిపెట్టిన బాధితులు ఆవేదనలో ఆత్మహత్యలకూ పాల్పడ్డారు.


ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!

సలార్‌లో హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ ఎవరిని ఎంచుకున్నారో తెలుసా?

మరిచిపోయామని అనుకుంటున్నారా?.. సీఏఏపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

ఇలా చేస్తే రేషన్ కార్డు చెల్లదు.. తేల్చేసిన కేంద్రం..?

అందం ఉంటే..ఆఫర్లు వస్తాయి..వారి కన్నీటి గాథ వింటే కన్నీళ్లు ఆగవు..

ఇళయరాజా రావచ్చు.. కానీ.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ప్రసాద్ స్టూడియోస్

పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>