Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/casting-couch8705fbaa-bdb5-4df4-b3b7-60982ad89c00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/casting-couch8705fbaa-bdb5-4df4-b3b7-60982ad89c00-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఓ బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు చేసింది. అవకాశం కోసం వెళ్తే ఓ డైరెక్టర్ తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడని బాధపడింది. హిందీలో ‘దిల్‌ తో హ్యాపీ హై జీ’ సీరియల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డోనల్ బిష్త్ ప్రస్తుతం మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ ఫాంలో ఉంది. డొనల్ బిష్త్ వృత్తి పరంగా జర్నలిస్ట్. అయినప్పటికీ నటనపై ఆసక్తి ఉండడంతో...casting couch;tiru;korea, south;bollywood;police;interview;industry;director;successసౌత్‌లో కాస్టింగ్ కౌచ్.. బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలుసౌత్‌లో కాస్టింగ్ కౌచ్.. బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలుcasting couch;tiru;korea, south;bollywood;police;interview;industry;director;successWed, 23 Dec 2020 13:17:57 GMTఇంటర్నెట్ డెస్క్: సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఓ బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు చేసింది. అవకాశం కోసం వెళ్తే ఓ డైరెక్టర్ తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడని బాధపడింది. హిందీలో ‘దిల్‌ తో హ్యాపీ హై జీ’ సీరియల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డోనల్ బిష్త్ ప్రస్తుతం మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ ఫాంలో ఉంది. డొనల్ బిష్త్ వృత్తి పరంగా జర్నలిస్ట్. అయినప్పటికీ నటనపై ఆసక్తి ఉండడంతో జర్నలిజాన్ని వదిలి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె కెరీర్‌ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అయితే ఇంత సక్సెస్ తనకు ఊరికే రాలేదని, ఇండస్ట్రీలోకి వచ్చిన తొలిరోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఎదురు దెబ్బలు తిన్నానని బిష్త్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమెను ఓ ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది.

అప్పట్లో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు తొలిగా ఓ షోకు తనను ఎంపిక చేశారని, అయితే ఏమైందో ఏమో చివరి నిముషంలో ఆ ప్రాజెక్టు నుంచి తనను తొలగించి వేరే యాక్ట్రెస్‌ని తీసుకున్నారని బిష్త్ వాపోయింది. ఆ ఘటనతో బాలీవుడ్‌పైనే కోపం వచ్చిందని, ఇక్కడంతా డూప్లికేట్, మోసం అనే అభిప్రాయానికి వచ్చేశానని చెప్పుకొచ్చింది. అయినా నటనపై ఉన్న మక్కువ తనను ఇండస్ట్రీ వదిలి వెళ్లకుండా చేసిందని, ఆ తరువాత కూడా అనేక ఆడిషన్స్‌కు వెళ్లేదాన్నని బిష్త్ చెప్పుకొచ్చింది.

అయితే అదే తరహాలో సౌత్‌లో కూడా అవకాశాల కోసం ప్రయత్నించేదాన్నని, అలాంటి సమయంలోనే ఓ డైరెక్టర్ నుంచి ఊహించని భయానక అనుభవం ఎదురైందని వెల్లడించింది. ‘ముంబైలోలానే సౌత్‌లో కూడా అవకాశాల కోసం ట్రై చేశా. అందులో భాగంగానే అక్కడి ఓ డైరెక్టర్‌ను కలిశాను. అతడు నాకు ఛాన్స్ ఇస్తానన్నాడు. ఎంతో సంతోషపడ్డాను. కానీ ఇంతలో ఓ ఘోరమైన కోరిక కోరాడు. ఛాన్స్ ఇచ్చినందుకుగానూ ప్రతిఫలంగా తనతో ఓ రాత్రి గడపాలని కోరాడు. అతడి మాటలకు షాకై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అవకాశాల కోసం అంత నీచానికి దిగజారే వ్యక్తిత్వం నాది కాదు. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. ఆ ఛాన్స్ వదిలేసుకున్నాను. ఇక మళ్లీ సౌత్ వైపు చూడలేదు. ఇప్పుడు బాలీవుడ్‌లోనే అవకాశాలు బాగా వస్తున్నాయి. నా కష్టం ఫలించింది. నా టాలెంట్ నాకా గుర్తింపు తెచ్చింది’ అంటూ డోనల్ బిష్త్ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి కాస్టింగ్ కౌచ్‌పై దేశ వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ క్రమంలో ప్రముఖ హీరోల పేర్లు, డైరెక్టర్ల పేర్లు, నిర్మాతల పేర్లు కూడా వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో డోనాల్ బిష్త్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టింస్తున్నాయి.


పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లి

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>