PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-vuhan9ff1627b-8cc8-40df-887f-4111cb8e3781-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-vuhan9ff1627b-8cc8-40df-887f-4111cb8e3781-415x250-IndiaHerald.jpgఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే మరెంతో మంది ఈ వైరస్ ప్రభావంతో అన్ని రకాలుగానూ నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరు ఈ వైరస్ ప్రభావంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ వైరస్ ప్రభావం నుంచి జనాలు బయట పడుతున్నారు. అలాగే వాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుండడంతో, ఈ వైరస్ పీడ విరగడ అవుతుంది అని జనాలంతా రిలాక్స్ అవుతున్న సమయంలోనే ఇప్పుడు కరోనాలో కొత్త రకం వైరస్ ప్రపంచాన్నcentral governent new carona virus britan;mumbai;india;december;november;doctor;central government;v;coronavirusకొత్తరకం కరోనాపై కంగారు పెట్టే వార్త చెప్పిన కేంద్రం ?కొత్తరకం కరోనాపై కంగారు పెట్టే వార్త చెప్పిన కేంద్రం ?central governent new carona virus britan;mumbai;india;december;november;doctor;central government;v;coronavirusWed, 23 Dec 2020 02:00:00 GMTకరోనా వైరస్ ప్రభావంతో కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే మరెంతో మంది ఈ వైరస్ ప్రభావంతో అన్ని రకాలుగానూ నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరు ఈ వైరస్ ప్రభావంతో ప్రత్యక్షంగానో,  పరోక్షంగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ వైరస్ ప్రభావం నుంచి జనాలు బయట పడుతున్నారు. అలాగే వాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుండడంతో, ఈ వైరస్ పీడ విరగడ అవుతుంది అని జనాలంతా రిలాక్స్ అవుతున్న సమయంలోనే ఇప్పుడు కరోనాలో కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ కంటే ఈ కొత్తరకం వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భారత్ లోనూ కొత్తరకం కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రజల్లోనూ అనేక భయాందోళనలు పెరిగిపోయాయి. దీనిపైన కేంద్రం క్లారిటీ ఇచ్చింది.



భారత్ లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించ లేదని పైకి చెబుతున్నా, ముంబై లో  కొత్త వైరస్ బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కనిపించాయి. ఈ  స్ట్రెయిన్ వైరస్ కరోనా వాక్సిన్ పై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. అనవసరంగా కొత్తరకం వైరస్ గురించి ఎక్కువగా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని , అప్రమత్తంగా ఉండడం అవసరమని, నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వి కె పాల్ తెలిపారు. బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా RT -PCR టెస్ట్ చేయించుకోవాలని ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెసిలిటీ లో ఐసోలేట్ అవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన కొత్త గైడ్లైన్స్ లో పేర్కొంది.



నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు యూకే నుంచి భారత్ కు వచ్చిన వారందరూ తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని తెలిపింది. టెస్ట్ పాజిటివ్ వచ్చిన వారు ప్రత్యేక ఐసోలేషన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసి ప్రయాణించిన సహచర ప్యాసింజర్ లకు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ వంటివి కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గైడ్లైన్స్ తెలిపింది .కొత్త వైరస్ నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను బుధవారం నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులలో ఎనిమిది మందికి ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కరోనా కంటే ఈ కొత్తరకం వైరస్ మరింత ప్రమాదకరం అనే విషయం అర్ధం అవుతోంది.


రివర్స్ అవుతున్న సోము...జగన్‌కు ఎఫెక్ట్ అవుతుందా?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>