Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rajini-kantc48ccaaf-1cd7-4a08-95a1-b385e3099ed5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rajini-kantc48ccaaf-1cd7-4a08-95a1-b385e3099ed5-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌ అర్థాంతరంగా నిలిచిపోయింది. షూటింగ్ సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే షూటింగ్‌ను నిలిపివేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. నగర శివార్లలోని రామోజీ ఫిల్మ్ ‌సిటీలో రజనీతో పాటు మరికొంతమంది స్టార్ నటులు ఈ షూటింగ్‌లో...rajini kant;rajinikanth;shiva;rajani;tara;cinema;rajani kanth;tamil;lord siva;heroరజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..rajini kant;rajinikanth;shiva;rajani;tara;cinema;rajani kanth;tamil;lord siva;heroWed, 23 Dec 2020 17:49:00 GMTఇంటర్నెట్ డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌ అర్థాంతరంగా నిలిచిపోయింది. షూటింగ్ సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే షూటింగ్‌ను నిలిపివేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. నగర శివార్లలోని రామోజీ ఫిల్మ్ ‌సిటీలో రజనీతో పాటు మరికొంతమంది స్టార్ నటులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇలాంటి సందర్భంలో షూటింగ్ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలడం కలకలం సృష్టిస్తోంది. ఈ హఠాత్పరిణామంతో చిత్ర బృందం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. వెంటనే షూటింగ్‌ను నిలిపివేయడమే కాక.. రజినీకాంత్‌తో సహా మిగిలిన నటులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌‌ పాటించనున్నట్లు సమాచారం. అందరికీ ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారని చిత్ర బృందం వెల్లడించింది.  

రజనీకాంత్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆయనతో కలిసి పనిచేసిన వారికి కరోనా సోకడంతో రజినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో తన రాజకీయ పార్టీకి సంబంధించి రజినీ కీలక ప్రకటనలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు కూడా అంతా సిద్ధమైంది. ఇలాంటి సందర్భంలో ఈ వార్త వినడంతో రజినీ అభిమాన సంఘాలు భయపడుతున్నాయి. ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నాయి. అయితే కరోనా ఎవరికి సోకింది..? వారు రజనీకాంత్‌కు ఎంత సన్నిహితంగా మెలుగుతారు..? అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.  

ఇదిలా ఉంటే ‘అన్నాత్తే’ చిత్రానికి తమిళ స్టార్ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నారు. శివ ఇంతకుముందు హీరో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు తెరకెక్కించారు. ఈ చిత్రాలన్నీ సూపర్ హిట్ కావడంతో రజినీ అన్నాత్తే కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 


దినేశ్‌ కార్తీక్‌ చేతికి ఆ జట్టు పగ్గాలు

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>