MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjarf882c891-bc7a-42fa-83fa-ae6773d9cf8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjarf882c891-bc7a-42fa-83fa-ae6773d9cf8a-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే కంటెస్టెంట్సందరూ తమకు అభిమానుల నుండి అందిన ప్రేమాభిమానాలను చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సీజన్ 4 కంటెస్టెంట్స్ చాలామంది వరుస ఆఫర్స్ తో బిజీగా మారుతున్నారు. ప్రేక్షకులు తమను ఆదరించినందుకు సంతోషపడుతున్నారు. ప్రేక్షకులకు పేరు పేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నారు. monal gajjar;abhijith;akhil akkineni;bhama;monal gajjar;hyderabad;gujarat - gandhinagar;cinema;telugu;bigboss;cheque;winner;winner1;star maa;gujarathi;house;anandamమోనాల్ కు స్టార్ మా భారీ ఆఫర్మోనాల్ కు స్టార్ మా భారీ ఆఫర్monal gajjar;abhijith;akhil akkineni;bhama;monal gajjar;hyderabad;gujarat - gandhinagar;cinema;telugu;bigboss;cheque;winner;winner1;star maa;gujarathi;house;anandamWed, 23 Dec 2020 11:00:00 GMTబిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే కంటెస్టెంట్సందరూ తమకు అభిమానుల నుండి అందిన ప్రేమాభిమానాలను చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సీజన్ 4 కంటెస్టెంట్స్ చాలామంది వరుస ఆఫర్స్ తో బిజీగా మారుతున్నారు. ప్రేక్షకులు తమను ఆదరించినందుకు సంతోషపడుతున్నారు. ప్రేక్షకులకు పేరు పేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నారు.

ఇక మోనాల్ విషయానికి వస్తే, గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ తెలుగులో దాదాపు ఐదు సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు గుర్తింపు మాత్రం లభించలేదు. గత మూడేళ్ళుగా ఆమె మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు.

బిగ్ బాస్ ఆమె ఫేట్ ను మార్చేసింది. ఆమెకు ఎంతో పాప్యులారిటీ వచ్చేసింది. నర్మదా అనే ట్యాగ్ లైన్ కానివ్వండి, అఖిల్ తో ఫ్రెండ్షిప్ కానివ్వండి, అభిజిత్ తో కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ కానివ్వండి లేదా మోనాల్ గ్లామర్ షో కానివ్వండి, మోనాల్ కు మాత్రం పాపులారిటీ వచ్చిందనే చెప్పుకోవాలి.

లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ వల్ల మోనాల్ తన మనసులోని భావాలను క్లియర్ గా కన్వే చేయలేకపోవడంతో అందరూ ఆమెను అపార్థం చేసుకుంటున్నారని అర్థం చేసుకున్న తరువాత ఆమెకు ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. అందుకే, మోనాల్ సూపర్ 6లో ఒకరిగా నిలిచింది.

మోనాల్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వరుస ఇంటర్వూస్ తో బిజీగా ఉంది. అలాగే ఈ అమ్మడు ఓ సినిమా ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మోనాల్ బుల్లితెరలో త్వరలో ప్రసారం కాబోతున్న "డాన్స్ ప్లస్ షో" లో జడ్జ్ గా వ్యవహరించబోతోందట. ఇందుకు మోనాల్ కు భారీగానే పే చెక్ ను అందించారట.

స్టార్ మా మోనాల్ కు ఇచ్చే రెమ్యునెరేషన్ బిగ్ బాస్ విన్నర్ కి ఇచ్చేటటువంటి ఎమౌంట్ తో సమానంగా ఉందని టాక్. మొత్తానికి గుజరాతీ భామ తన ముద్దుముద్దు తెలుగుతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

నిజానికి హౌస్ నుంచి బయటకు రాగానే మోనాల్ గుజరాత్ వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ, మోనాల్ వరుస ఆఫర్స్ తో ఇంకొన్ని సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉండేలా ఉంది. బిగ్ బాస్ పవర్ అంటే ఇదేనేమో అనంటున్నారు సినీ విశ్లేషకులు.


ఆ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ని అడ్డంగా ఇరికించాడు...!

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

మెగా హీరో తో కెమిస్ట్రీ బాగుందన్న ఇస్మార్ట్ బ్యూటీ....!?

జ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!

పంజాబీ వ్యక్తి తో ప్రేమాయణం.. పొట్టకూటి కోసం ఆ పని చేసా..రోజంతా ఏడ్చాను : మయూరి సుధాచంద్రన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>