PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-planing-to-give-sagar-ticket-to-bc-leader5f4da9b9-6062-47c3-a8f7-fad978be0236-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-planing-to-give-sagar-ticket-to-bc-leader5f4da9b9-6062-47c3-a8f7-fad978be0236-415x250-IndiaHerald.jpgనాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో జరగనున్న ఉపఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటివరకు ఇక్కడ కనీస పోటీ ఇవ్వ లేకపోయింది బీజేపీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డికి కేవలం 2 వేల 6 వందల ఓట్లు వచ్చాయి. దీంతో ఈసారి గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కమలదళం.. నాగార్జునసాగర్‌ అభ్యర్థిపై భారీ కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బీసీ నేత అయిన కడారి అంజయ్యయాదవ్ వైపుnagarjunasagar;sridhar;bharatiya janata party;pithe;kamma;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;2019;district;scheduled caste;scheduled tribes;backward classes;assembly;mla;survey;wife;tdp;butter;reddyసాగర్ లో బీసీ నేత వైపు బీజేపీ మొగ్గు!సాగర్ లో బీసీ నేత వైపు బీజేపీ మొగ్గు!nagarjunasagar;sridhar;bharatiya janata party;pithe;kamma;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;2019;district;scheduled caste;scheduled tribes;backward classes;assembly;mla;survey;wife;tdp;butter;reddyWed, 23 Dec 2020 08:41:30 GMTఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో జరగనున్న ఉపఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటివరకు ఇక్కడ కనీస పోటీ ఇవ్వ
లేకపోయింది బీజేపీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డికి కేవలం 2 వేల 6 వందల ఓట్లు వచ్చాయి. దీంతో ఈసారి గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కమలదళం.. నాగార్జునసాగర్‌ అభ్యర్థిపై భారీ కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బీసీ నేత అయిన కడారి అంజయ్యయాదవ్ వైపు బీజేపీ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దాదాపు 2.17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా నమోదవుతున్న ఓటర్లతో కలిపితే మొత్తం 2.2 లక్షల వరకు ఉంటారని అంచనా. గతంలో చేపట్టిన సర్వే ప్రకారం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు 1.3 లక్షల మంది ఉంటే.. ఇందులో యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 50 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఎస్టీలు మరో 35 వేలు, రెడ్డి సామాజిక వర్గం 15 వేలు, కమ్మ వర్గం నుంచి 6 నుంచి 7 వేలు, మరో 20 వేల ఎస్సీ ఓట్లు ఉంటారని సమాచారం.  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బలమై న బీసీ సామాజిక నేతగా కడారి అంజయ్యయాదవ్‌కు తగిన గుర్తింపు ఉంది. అందులో నూ ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అతడికి మరింతగా కలిసొచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 27,852 ఓట్లను సాధించగలిగాడు.

సాగర్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో టికెట్ ఆశించే వారిలో కడారి అంజయ్యయాదవ్‌, ప్రస్తుత నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదితారెడ్డి ఉన్నారు. దీంతో  కడారి అంజయ్యయాదవ్‌పై బీజేపీ ఫోకస్ చేసింది. 2019 ఆగస్టులో బీజేపీలో చేరిన కడారి అంజయ్యయాదవ్ నాటి నుంచి బీజేపీ నియోజకవర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్న ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గాల నేతలతో సన్నిహిత సంబంధాలు కడారి అంజయ్యకు ఉన్నాయి. ఆ వర్గాల్లో ప్రభావం చూపే నేతలంతా కడారి వర్గంలో ఉండడం.. ఆ విషయంపై ఇప్పటికే సమగ్ర సమాచారం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అందడంతో కడారి అంజయ్య యాదవ్‌కు మంచి అవకాశంగా మారింది. కడారి అంజయ్యయాదవ్‌ను రంగంలోకి దింపితే.. నాగార్దున సాగర్‌ను కైవసం చేసుకోవచ్చనే అభిప్రాయానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది.




అమెరికా చరిత్రలోనే రెండో అతిపెద్ద ఎకనామిక్‌‌‌‌ రిలీఫ్‌‌ ప్యాకేజి

కరోనా టైప్ -2 నేపథ్యంలో తెలంగాణ సంచలన నిర్ణయం..

డాక్టర్లను విడిచిపెట్టని జగన్ ... ! ఇక పల్లెల్లో ఏం చేయబోతున్నారంటే ?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>