PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpf5ef9060-fd9a-4d0d-873a-76ae009ee112-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpf5ef9060-fd9a-4d0d-873a-76ae009ee112-415x250-IndiaHerald.jpgశత్రివు కీడు కోరుకుంటాడు. మాటలు చాలా తీయగా చెబుతూనే ముంచేస్తాడు. అదే స్నేహితుడు ఘాటుగా విమర్శలు చేస్తాడు. అవి చేదుగా ఉంటాయి. అసలు మింగుడు పడవు. కానీ కాలగమనంలో వాటి విలువ తెలుస్తుంది. ఇపుడు వైసీపీలో జగన్ కి మిత్రులు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ భజన చేసేవారంతా చేటు తెస్తున్నట్లే లెక్క అంటారు. ఈ భజన వల్లనే గతంలో చంద్రబాబు కూడా బోల్తా కొట్టారు. ఇదిలా ఉంటే ఏపీలో ఏ రాజకీయ పార్టీకి చెందని ఒక సీనియర్ నేత ఉన్నారు. ఆయన ఎంపీగా కూడా రెండు సార్లు పనిచేశారు. ycp;kumaar;mithra;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;vundavalli aruna kumar;ycp;undavalliవైసీపీ భవిష్యత్తు దాని మీదేనంటున్న వైఎస్సార్ ఫ్రెండ్ ?వైసీపీ భవిష్యత్తు దాని మీదేనంటున్న వైఎస్సార్ ఫ్రెండ్ ?ycp;kumaar;mithra;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;vundavalli aruna kumar;ycp;undavalliWed, 23 Dec 2020 10:00:00 GMTజగన్ కి మిత్రులు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ భజన చేసేవారంతా చేటు తెస్తున్నట్లే లెక్క అంటారు. ఈ భజన వల్లనే గతంలో చంద్రబాబు కూడా బోల్తా కొట్టారు. ఇదిలా ఉంటే  ఏపీలో ఏ రాజకీయ పార్టీకి చెందని ఒక సీనియర్ నేత ఉన్నారు. ఆయన ఎంపీగా కూడా రెండు సార్లు పనిచేశారు.

ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన ఏపీ ప్రయోజనాల కోసం ఎంత దాకా అయినా వెళ్తారు. ఎందరితో అయినా ఢీ కొడతారు. ఆయన ఉమ్మడి ఏపీ విభజన అడ్డగోలు, రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఇప్పటిదాకా వాదిస్తూనే ఉన్నారు. ఇక పోలవరం విషయంలో నాడు వైఎస్సార్ సీఎం గా ఉంటే అన్ని రకాల అనుమతులు సాధించుకుని వచ్చిన వారిలో ఉండవల్లి కూడా ముందుంటారు.

అటువంటి ఉండవల్లి విభజన తరువాత పోలవరం మీద ఏపీ పాలకులతో పాటు కేంద్రాన్ని కూడా ఒక్కటే పోరుతున్నారు. అదే విధంగా ఆయన హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇక పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని జగన్ నిండు సభతో పాటు, పోలవరం వద్ద కూడా స్పష్టం చేసినా కూడా ఉండవల్లి మళ్ళీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే 2022 అని డెడ్ లైన్లు పెడుతున్నా కూడా పోలవరం అప్పటికి పూర్తి కాదు, అక్కడ కట్టేది జస్ట్ ఆనకట్ట మాత్రమేనని కూడా అంటున్నారు.

పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నారు అని ఉండవల్లి తాజాగా గట్టిగానే విమర్శలు చేశారు. అదే కనుక జరిగితే జనం చూస్తూ ఊరుకోరని, తగిన తీరులో జవాబు చెబుతారని కూడా ఆయన హెచ్చరించారు. మొత్తానికి వైసీపీ ఫ్యూచర్ అంతా ఆ ప్రాజెక్ట్ మీదనే ఆధారపడి ఉందని ఆయన అంటున్నారు. తేడాలొస్తే లెక్కలు కూడా మారిపోతాయని కూడా అంటున్నారు.




హైపర్ ఆది ఒడిలో ప్రియమణి.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..?

ఉత్తరాది గ్యాంగ్స్టర్ లతో అనకాపల్లి, గాజువాకలకు సంబంధం ఏంటి ?

గంటా కోసం చిరంజీవి ప్రయత్నాలు

ప్రశాంత్, ఎన్టీఆర్ ల సినిమా ఉన్నట్లా...లేనట్లా..?

తన విగ్రహం గురుంచి స్పందించిన సోనూ సూద్.. ఏమన్నాడో తెలుసా.?

సునీల్ కు "బెల్ బాటమ్" సూటవుతుందా...?

ఏపీ ప్రభుత్వం : ఆన్ లైన్ కాల్ మనీ కేసులపై ఉక్కుపాదం...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>