BeautyHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hairy78ebb50c-610b-4cff-bbf8-a5b4389c8a5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hairy78ebb50c-610b-4cff-bbf8-a5b4389c8a5c-415x250-IndiaHerald.jpgమందార పువ్వు మొక్కలను ఎక్కువగా మన ఇంటి ఆవరణలో ఆకర్షణ కోసం పెంచుతుంటాము. అలాగే ఈ పువ్వులను దేవుడికి కూడా సమర్పిస్తుంటాం. ఇందుకోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తామని మనందరికీ తెలుసు. కానీ మందార పువ్వును మన జుట్టుకు వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.hairy;deva;apple;prakasam;vitamin c;vitamin;oil;letter;prakasam district;european union;prakasm;custard apple;manamమందారంతో వత్తైన జుట్టు మీ సొంతం.. ఎలా అంటే?మందారంతో వత్తైన జుట్టు మీ సొంతం.. ఎలా అంటే?hairy;deva;apple;prakasam;vitamin c;vitamin;oil;letter;prakasam district;european union;prakasm;custard apple;manamWed, 23 Dec 2020 14:06:11 GMTమందార పువ్వు మొక్కలను ఎక్కువగా మన ఇంటి ఆవరణలో ఆకర్షణ కోసం పెంచుతుంటాము. అలాగే ఈ పువ్వులను దేవుడికి కూడా సమర్పిస్తుంటాం. ఇందుకోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తామని  మనందరికీ తెలుసు. కానీ మందార పువ్వును మన జుట్టుకు వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మన అమ్మమ్మ లతోపాటు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం మందార పువ్వు ప్యాక్ ను జుట్టుకు వేసుకోవడం వల్ల జుట్టు పెరగడంతో పాటు ఎన్నో రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయని మనకు తెలుసు.ఆ ప్రయోజనాలు ఏంటో, మందారపు పువ్వు ఏవిధంగా మన జుట్టుకు సహకరిస్తుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మందార పువ్వు మన జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహకరిస్తుంది.మన జుట్టు పెరుగుదలకు అవసరమైన కెరోటిన్ ఉత్పత్తి అవడానికి అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు మందార పువ్వులో పుష్కలంగా లభిస్తాయి. ఈ మందార పువ్వును మెత్తగా రుబ్బి, జుట్టుకు పట్టించి ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు మూడు సార్లు చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు కావలసిన అమైనో ఆమ్లాలు సమృద్ధిగా దొరికి తొందరగా జుట్టు పెరుగుతుంది.

మృదువైన, అందమైన లుక్ కోసం మీరు ఎల్లప్పుడూ మందార పువ్వును ఉపయోగించవచ్చు. ఈ మందార పువ్వును ఎండబెట్టి పొడి చేసుకుని, అందుకు కొద్దిగా అలోవెరా జెల్ ను కలిపి మాడుకు పూర్తిగా పట్టించాలి.ఈ పేస్ట్ ను వారానికి కనీసం రెండు సార్లు వాడడం వల్ల అందమైన, ప్రకాశవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది.మార్కెట్లో దొరికే ఎన్నో రసాయనాలతో కూడిన మందార షాంపూలను అమ్ముతుంటారు. ఇలాంటి వాటి వల్ల జుట్టు ప్రకాశంవంతం చేయకపోగా, నిర్జీవంగా తయారవుతుంది. ఇలాంటి వాటి నుండి బయట పడాలంటే ఇంట్లో తయారుచేసుకునే మందార పొడిని నీటిలో కలిపి, షాంపూలాగా ఉపయోగించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మందార పువ్వు రక్తస్రావాన్ని నివారించే లక్షణం కలిగి ఉంటుంది.  ఇది జుట్టు మొదళ్లలో విడుదలయ్యే అధిక నూనె శాతాన్ని తగ్గించి,చుండ్రుతో పాటు దురదను తగ్గిస్తుంది.ఇందుకోసం మందారపొడి, గోరింటాకుపొడి, రెండు చుక్కల నిమ్మరసంతో కలిపి పేస్ట్ లా  చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మాడుకు పట్టించి, తేలికగా మసాజ్ చేయాలి.ఇలా చేయడం వల్ల మాడుకు చల్లదనంతో పాటు చుండ్రు వంటి సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది.

మందార పువ్వుకు జుట్టు రాలడం వంటి సమస్యలు నివారించే లక్షణం కూడా ఉంది.వీటిలో లభించే విటమిన్ సి, అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఇందుకోసం మందార పొడిని బాదం నూనెతో కలిపి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 


దేవాలయానికి ఆస్తి రాసిచ్చిన దంపతులు.. కారణం అదే!

పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లి

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>