MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/ramcharande720d69-b0e2-4e2e-9fa0-7b4a54963756-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/ramcharande720d69-b0e2-4e2e-9fa0-7b4a54963756-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన భర్త విష్ణుతో కలసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌‌పై తొలిసారి నిర్మించిన ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేర్‌’ వెబ్‌సిరీస్‌ ఈ నెల 25 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమ్‌ కానుంది.ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో సుస్మిత తన తమ్ముడు, టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ తేజ్ చేతుల మీదుగా స్పెషల్‌ షో రీల్‌ను విడుదల చేశారుramcharan;chiranjeevi;ram charan teja;mithra;pawan kalyan;ram pothineni;teja;vishnu;tollywood;police;media;husband;hero;father;santoshamఎలా మొదలెట్టాం అన్నది కాదు... ఎలా ముగించాం అన్నదే ముఖ్యం - రామ్ చరణ్ఎలా మొదలెట్టాం అన్నది కాదు... ఎలా ముగించాం అన్నదే ముఖ్యం - రామ్ చరణ్ramcharan;chiranjeevi;ram charan teja;mithra;pawan kalyan;ram pothineni;teja;vishnu;tollywood;police;media;husband;hero;father;santoshamWed, 23 Dec 2020 11:10:00 GMTమెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన భర్త విష్ణుతో కలసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌‌పై తొలిసారి నిర్మించిన ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేర్‌’ వెబ్‌సిరీస్‌ ఈ నెల 25 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమ్‌ కానుంది. ‘ఓయ్‌’ ఫేం ఆనంద్‌ రంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, తేజ, నందినిరాయ్‌ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రధానంగా పోలీసులు, నేరస్థుల జీవితాల్లోని యదార్థ సంఘటనలను ఆధారంగా తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో సుస్మిత తన తమ్ముడు, టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ తేజ్ చేతుల మీదుగా స్పెషల్‌ షో రీల్‌ను విడుదల చేశారు.


ఈ సందర్భంగా హీరో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘కరోనా లాక్‌డౌన్‌ తర్వాత మరలా ఇన్ని రోజులకు ఈ కార్యక్రమం ద్వారా మీడియా మిత్రులను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలా మొదలెట్టాం అన్నది కాదు, ఎలా ముగించాం అన్నదే ముఖ్యం. ఇప్పటి నుంచి అంతా కొత్తగా ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నా. ఇక ఈ వెబ్‌సిరీస్‌ విశేషాలను నాన్నగారి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. దర్శకుడు ఆనంద్‌ రంగా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ వెబ్‌సిరీస్‌ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. నాన్న పరిశ్రమలో ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మా కుటుంబం ఎన్నో ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త ఓటీటీలో సుష్మిత ఫైటర్‌ అని చెప్పగలను. తనే నాకు పెద్ద సపోర్ట్‌. అక్క, బావ.. ఆనంద్‌ రంగాతో ఈ సిరీస్‌ తెరకెక్కించడం సంతోషంగా ఉంది. కొవిడ్‌ టైంలో అందరూ ఎంతో కష్టపడి చేశారు. ఈ వెబ్‌సిరీస్‌తో అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. సుస్మితకు, వాళ్ళ టీమ్‌ అందరికీ నా బెస్ట్ విషెస్‌’ అని రామ్‌చరణ్ పేర్కొన్నారు.


దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

మెగా హీరో తో కెమిస్ట్రీ బాగుందన్న ఇస్మార్ట్ బ్యూటీ....!?

జ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!

పంజాబీ వ్యక్తి తో ప్రేమాయణం.. పొట్టకూటి కోసం ఆ పని చేసా..రోజంతా ఏడ్చాను : మయూరి సుధాచంద్రన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>