PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/funds-help-in-farmers-accounts4f76a11c-56dc-4b43-ad18-1da165511c81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/funds-help-in-farmers-accounts4f76a11c-56dc-4b43-ad18-1da165511c81-415x250-IndiaHerald.jpgఅనవసరమైన ప్రతిపాదనలు చేయడం మానుకొని.. పనికొచ్చే ప్రతిపాదన ఒకటి లిఖిత పూర్వకంగా పంపితే చర్చలు జరుగుతాయని కేంద్రానికి తేల్చి చెప్పాయి రైతు సంఘాలు. డిమాండ్ల సాధన కోసం ఆందోళనలను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు రోజు రోజుకి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని రేపు సాయంత్రానికి రైతుల అకౌంట్లలో వేస్తామని ప్రకటించారు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి. funds help in farmers accounts;modi;nidhi;delhi;pithe;january;prime minister;minister;central government;party;mantraరైతుల అకౌంట్లలో నిధి సాయం !రైతుల అకౌంట్లలో నిధి సాయం !funds help in farmers accounts;modi;nidhi;delhi;pithe;january;prime minister;minister;central government;party;mantraWed, 23 Dec 2020 22:00:00 GMTఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు రోజు రోజుకి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని రేపు సాయంత్రానికి రైతుల అకౌంట్లలో వేస్తామని ప్రకటించారు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి.

రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు అన్నదాతలు. ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం28వ రోజుకు చేరుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి తీవ్రత పెరిగిపోతున్నా మడమ తిప్పకుండా రైతన్నలు ఆందోళన కొనసాగిస్తున్నారు. నూతన చట్టాలను రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని వెల్లడించారు. ఈనెల 26, 27, 28వ తేదీల్లో హర్యానాలోని టోల్‌ప్లాజాల్లో వసూళ్లను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రం తూతూ మంత్రం ప్రతిపాదనలు చేసే బదులు.. పటిష్టమైన అజండాతో వస్తే చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు.

రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నామని.. త్వరలోనే రైతులు నిరసనలు విరమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ చేరుకున్న ఎన్జీవోల ప్రతినిధులు వ్యవసాయమంత్రి తోమర్‌ను కలుసుకున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు సాయం అందిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇస్తున్న సాయం గురువారం సాయంత్రానికి రైతుల అకౌంట్లలో వేస్తామని.. ఈ సమయంలో ప్రధాని మోడీ రైతులతో ముచ్చటిస్తారని కేంద్రమంత్రి తెలిపారు

కేంద్రం పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కావడంలేదు. రైతు చట్టాలపై కేంద్ర వైఖరిని పలువురు ప్రముఖులు, పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని.. రెండు కోట్ల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతికి రేపు సమర్పించనుంది కాంగ్రెస్‌ పార్టీ. జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావద్దంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌  జాన్సన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆ దేశ ఎంపీలకు లేఖలు రాస్తున్నారు రైతులు. ఈ నెల 25, 26 తేదీల్లో భారత రాయబార  కార్యాలయాల వెలుపల పంజాబీలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు.


ప్రాంతీయ పార్టీలకు కొత్త సవాల్...బెంగాల్ ఎన్నికలు ?

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>