PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcrb15a73dd-f5dc-4404-aa97-92a2a8d0e751-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcrb15a73dd-f5dc-4404-aa97-92a2a8d0e751-415x250-IndiaHerald.jpgగతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్...ప్రస్తుతం ఓ రాజకీయ విశ్లేషుకుడి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ బలంగా ఉన్న సమయంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఉండవల్లి, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. అలాగే ఓ క్రిటిక్‌గా మారారు. గత చంద్రబాబు ప్రభుత్వం సమయంలో అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టి, ప్రభుత్వం తప్పొప్పులని చెప్పేవారు. kcr;kcr;kumaar;godavari river;jagan;andhra pradesh;telangana;vundavalli aruna kumar;congress;mp;government;media;tdp;ycp;undavalliకేసీఆర్ భయపెట్టిన ఏపీ నాయకులు ఎవరు?కేసీఆర్ భయపెట్టిన ఏపీ నాయకులు ఎవరు?kcr;kcr;kumaar;godavari river;jagan;andhra pradesh;telangana;vundavalli aruna kumar;congress;mp;government;media;tdp;ycp;undavalliWed, 23 Dec 2020 00:00:00 GMTకాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్...ప్రస్తుతం ఓ రాజకీయ విశ్లేషుకుడి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ బలంగా ఉన్న సమయంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఉండవల్లి, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. అలాగే ఓ క్రిటిక్‌గా మారారు. గత చంద్రబాబు ప్రభుత్వం సమయంలో అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టి, ప్రభుత్వం తప్పొప్పులని చెప్పేవారు.

అయితే అప్పుడు ఉండవల్లి అలా మాట్లాడటంపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యేవారు. ఉండవల్లి జగన్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక కూడా ఉండవల్లి పెద్దగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. కానీ తాజాగా మాత్రం ఉండవల్లి ఊహించని విధంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ఎత్తు విషయంలో మాట్లాడిన ఉండవల్లి, ప్రాజెక్టులో 41 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలనే.. జగన్‌ సర్కార్‌ ఆలోచనని ఉండవల్లి తప్పుబట్టారు.

అయితే గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్రం పలు ప్రాజెక్టులు కడుతుందని, వాటిపై నోరెత్తితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించారన్నారు. దీని గురించి ఏపీ నేతలే మాట్లాడాలని, కానీ వాళ్ల ఆస్తులు అక్కడ ఉన్నాయని, ఇంకెవరు మాట్లాడతారు? అని ప్రశ్నించారు. వాస్తవానికి చూసుకుంటే తెలంగాణలో చాలామంది ఏపీ నాయకులకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి.

ఉమ్మడి ఏపీలో అనేక మంది ఏపీ నేతలు హైదరాబాద్‌లో ఆస్తులు కూడబెట్టుకున్నారు. అధికార వైసీపీ కావొచ్చు, ప్రతిపక్ష టీడీపీ కావొచ్చు ఈ రెండు పార్టీలకు చెందిన నాయకుల ఆస్తులు ఉన్నాయి. అందుకే రెండు పార్టీల నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై పెద్దగా ఎలాంటి విమర్శలు చేయరు. అలాగే తెలంగాణ ప్రాజెక్టులపై కామెంట్ చేసే ధైర్యం చేయరు. దీని దృష్టిలో పెట్టుకునే ఉండవల్లి మాట్లాడారు. మొత్తానికైతే కొందరు ఏపీ నాయకులకు కేసీఆర్ సర్కార్ అంటే భయం ఉందనే చెప్పొచ్చు. ఏదేమైనా ఉండవల్లి జగన్ ప్రభుత్వంపై మాటల దాడి పెంచినట్లే కనిపిస్తోంది.




వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>