MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss40351c07b-8388-4440-adea-218a6211d0c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss40351c07b-8388-4440-adea-218a6211d0c7-415x250-IndiaHerald.jpgబిగ్‌బాస్ సీజన్ 4 విజేతగా మిస్టర్ కూల్ అభిజిత్ గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఈ సీజన్ టైటిల్‌ను అభిజిత్ గెలుచుకోబోతున్నాడని చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే అఖిల్ అందరికంటే ముందే ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు. దీంతో అఖిల్ కూడా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకున్నారు. biggboss4;nagarjuna akkineni;abhijith;akhil akkineni;winner;misterనాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లినాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లిbiggboss4;nagarjuna akkineni;abhijith;akhil akkineni;winner;misterWed, 23 Dec 2020 12:29:36 GMTమిస్టర్ కూల్ అభిజిత్ గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఈ సీజన్ టైటిల్‌ను అభిజిత్ గెలుచుకోబోతున్నాడని చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే అఖిల్ అందరికంటే ముందే ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు. దీంతో అఖిల్ కూడా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకున్నారు. ఏదేమైనప్పటికి విజేతగా మాత్రం అభిజిత్ గెలిచాడు. అయితే ఫైనల్ ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి తాజాగా అఖిల్ తల్లి మాట్లాడారు. ఆ సంఘటన ఏంటంటే.. హోస్ట్‌గా ఉన్న నాగార్జున టైటిల్ గెలిచేది ఎవరో చెప్పారు. విజేత ఎవరో చెప్పే ముందు ఆయన అభిజిత్, అఖిల్ ఇద్దరు చేతులను పట్టుకున్నారు. ఇద్దరి చేతులను ఒకసారి పైవరకు తీసుకెళ్లి మళ్లీ కిందకు తెచ్చారు.

మరోసారి ఇద్దరి చేతులను పైకి తీసుకెళ్తూ.. అభిజిత్ చేతిని ఒక్కసారిగా పైకి లేపి.. అఖిల్ చేతిని కిందకు విసిరేశారు. దీనిపై సోషల్ మీడియాలోను చర్చ సాగింది. నాగార్జున అఖిల్ చేతిని ఆ విధంగా కిందకు విదిలించడం ఏమాత్రం బాలేదని నెటిజన్లు చెబుతున్నారు. ఇదే విషయంపై అఖిల్ తల్లి కూడా స్పందించారు. ఆ సమయంలో తన కొడుకు చేతిని నాగార్జున అలా బలవంతంగా కిందకు విదిలించడం చూసి తాను ఎంతో బాధకు గురయ్యానన్నారు. నాగార్జున ఆ విధంగా చేయకుండా ఉండుంటే బాగుండేదని అన్నారు. ఏ

మైనప్పటికి తన కొడుకు టైటిల్ గెలవకపోయినప్పటికి.. ప్రజల మనసును గెలచుకున్నాడని ఆమె అన్నారు. తన కొడుకు గెలుస్తాడని ముందు నుంచి తాను ఎంతో నమ్మకంతో ఉన్నట్టు అఖిల్ తల్లి చెప్పారు. అయితే తన కొడుకు టైటిల్ గెలవకపోవడం కొంచెం బాధ అనిపించిందన్నారు. సోహెల్ బదులు అఖిల్ రూ. 25 లక్షలు తీసుకొని ఉంటే బాగుండేదన్న చర్చ కూడా సాగుతోంది. అఖిల్‌కు అటు రూ. 25 లక్షలు దక్కలేదని, ఇటు టైటిల్‌ను కూడా మిస్ చేసుకున్నాడని అఖిల్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>