PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-group-war-kishan-reddy-bandi-sanjay-clashes5c0ec0fc-1e85-4954-8b91-1819314d6a8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-group-war-kishan-reddy-bandi-sanjay-clashes5c0ec0fc-1e85-4954-8b91-1819314d6a8c-415x250-IndiaHerald.jpgకొందరు పార్టీ నేతలు మాత్రం కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ కమలంలో కాక రేపుతున్నారు. తమకు అధికారం ఖాయమని చెప్పడమే కాదు.. పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారో కూడా చెప్పేస్తున్నారు. కేంద్రమంత్రిగాఉన్న కిషన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన సీఎం ప్రకటన ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో కలకలం రేపుతోంది. telangana bjp;bapu;sekhar;hyderabad;bharatiya janata party;telangana;mohandas karamchand gandhi;g kishan reddy;mp;రాజీనామా;district;backward classes;huzur nagar;lotus;chief minister;assembly;minister;central government;adilabad;reddy;mahbubnagar;party;bapu1తెలంగాణ కమలంలో కుమ్ములాటలు!తెలంగాణ కమలంలో కుమ్ములాటలు!telangana bjp;bapu;sekhar;hyderabad;bharatiya janata party;telangana;mohandas karamchand gandhi;g kishan reddy;mp;రాజీనామా;district;backward classes;huzur nagar;lotus;chief minister;assembly;minister;central government;adilabad;reddy;mahbubnagar;party;bapu1Wed, 23 Dec 2020 19:58:24 GMTఅసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కమలం పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. పార్టీలోకి వలసలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు పార్టీ నేతలు మాత్రం కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ కమలంలో  కాక రేపుతున్నారు. తమకు అధికారం ఖాయమని చెప్పడమే కాదు.. పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారో కూడా చెప్పేస్తున్నారు. కేంద్రమంత్రిగాఉన్న కిషన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన సీఎం ప్రకటన ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో కలకలం రేపుతోంది.  ఎంపీ సోయం ప్రకటనపై  పార్టీ పెద్దలు ఆరా తీసినట్లు చెబుతున్నారు. సోయం వ్యాఖ్యలపై బండి సంజయ్ వర్గం గరంగరంగా ఉందని తెలుస్తోంది

తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అయితే వలసలతో పాటు వర్గపోరు పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుందన్న ప్రచారం ఉంది. సంజయ్ కి పార్టీ పగ్గాలు వచ్చే వరకు తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డిదే హవా. బండి వచ్చాక పార్టీలో ఆయన  ప్రాధాన్యత తగ్గిందంటున్నారు.రోజు రోజుకు సంజయ్ గ్రాఫ్ పెరిగిపోతుండగా.. పార్టీలో కిషన్ రెడ్డి నామమాత్రంగా మారిపోతున్నారు. ఇది గ్రహించిన కిషన్ రెడ్డి కూడా దూకుడు పెంచారని చెబుతున్నారు. అందులో భాగంగానే సోయం బాపురావు ముఖ్యమంత్రి పోస్టుపై ప్రకటన చేశారనే చర్చ బీజేపీ కార్యాలయంలో జరుగుతోంది. కిషన్ రెడ్డి చొరవతో బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీ అయ్యారు సోయం. అందుకే కిషన్ రెడ్డికి మద్దతుగా ఆయన ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తోనూ కిషన్ రెడ్డికి పడటం లేదని చెబుతున్నారు.

తెలంగాణ బీజేపీలో కుల కుమ్ములాటలు తీవ్రమయ్యాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ పార్టీకి రాజీనామా చేసి కలకలం రేపారు. పాలమూరు జిల్లా బీజేపీలో ప్రస్తుతం మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పినట్లే జరుగుతుందట. బీసీ నేతలను వాళ్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బండి సంజయ్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో  తనను పట్టించుకోలేదనే మనస్తాపంతోనే ఎర్ర శేఖర్ రాజీనామా చేశారని చెబుతున్నారు.
బండి సంజయ్  బుజ్జగించడంతో ఆయన తిరిగి మనసు మార్చుకున్నా.. బీసీ, రెడ్డి నేతల మధ్య బీజేపీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయన్నది  ఆ ఘటనతో తెలిసిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ లోని తార్నాకలో రెండు వర్గాలు నడిరోడ్డుపైనే కొట్టుకున్నాయి.

హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లానే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీజేపీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉందంటున్నారు.పాత నేతలు, కొత్త నేతలకు పొసగడం లేదట. సామాజిక వర్గాల వారీగా నేతలు గ్రూపులు కడుతున్నారని తెలుస్తోంది. భారీగా వచ్చి చేరుతున్న వలస నేతలతో తమకు ప్రయోజనం ఉంటుందో లేక వర్గ విభేదాలతో అసలుకే మోసం వస్తుందో తెలియడం లేదని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే .. ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.




టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి!

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>