PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr40020f99-01a5-4e05-b63e-f8633cbee927-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr40020f99-01a5-4e05-b63e-f8633cbee927-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోయాయి. గతంలో కేసీఆర్ ఆధిపత్యంతో ఏ లీడర్ వాయిస్ కూడా పెద్దగా వినిపించేది కాదు. తెలంగాణ వచ్చిన నాటినుండి మొన్నటి దుబ్బాక ఎన్నికల ముందు వరకు కేసీఆర్ చేసిందే శాశనం గా తయారైంది.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పెద్ద షాక్ తగిలింది. దుబ్బాక లో ఓడిపోయి నిరాశలో ఉన్న కేసీఆర్ కి గ్రేటర్ లో వచ్చిన ఫలితాలు పుండుమీద కారణం చాలినంత పనయ్యింది. kcr;kcr;amala akkineni;bharatiya janata party;telangana;congress;district;degree;aqua;central government;leader;partyకేసీఆర్ సరికొత్త చేతలకు సాగర్ ఎన్నికలే కారణమా..?కేసీఆర్ సరికొత్త చేతలకు సాగర్ ఎన్నికలే కారణమా..?kcr;kcr;amala akkineni;bharatiya janata party;telangana;congress;district;degree;aqua;central government;leader;partyWed, 23 Dec 2020 22:00:00 GMTకేసీఆర్ ఆధిపత్యంతో ఏ లీడర్ వాయిస్ కూడా పెద్దగా వినిపించేది కాదు. తెలంగాణ వచ్చిన నాటినుండి మొన్నటి దుబ్బాక ఎన్నికల ముందు వరకు కేసీఆర్ చేసిందే శాశనం గా తయారైంది.. అయితే   దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పెద్ద షాక్ తగిలింది. దుబ్బాక లో ఓడిపోయి నిరాశలో ఉన్న కేసీఆర్ కి గ్రేటర్ లో వచ్చిన ఫలితాలు  పుండుమీద కారణం చాలినంత పనయ్యింది.

దానికి తోడు బీజేపీ బలపడుతుండడం కూడా ఆయనకు ఏమాత్రం నచ్చడంలేదు.. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. కాంగ్రెస్ లాంటి మేటి పార్టీ ని వెనక్కి తిరిగి చుకోకుండా చేసింది..    కేంద్రం కూడా తెలంగాణ లో పాతుకుపోవడానికి రాష్ట్ర బీజేపీ నేతలకు ఊతంగా నిలుస్తుంది.. గ్రేటర్ ప్రచారంలో బీజేపీ హేమాహేమీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరు కేసీఆర్ పై వ్యతిరేకత ను తేవడంలో మంచి ఫలితాలు సాధించారు. నిజానికి కేసీఆర్ పై  వ్యతిరేకత తేవడంలో ప్రతిపక్షాలు ఎప్పటినుంచో  తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి..

అయితే ఈ వ్యతిరేకత ను తగ్గించుకోవడానికి కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ముంచుకొస్తున్న వేళ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో పాటు కేసీఆర్‌ కొత్త వరాలూ ప్రకటించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన ఎత్తిపోతల పథకాలతో పాటు మరికొన్ని ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.నియోజకవర్గంలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఎత్తిపోతల పథకాల మంజూరుపై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ నదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్‌ ఎత్తిపోతల పథకానికి రూ.75.93 కోట్లు కేటాయించారు.సిద్దిపేటలో డ‌బుల్ ఇళ్ల‌ను ప్రారంభించిన కేసీఆర్ మ‌రిన్ని కార్య‌క్ర‌మాల కోసం అడ‌క్కుండానే నిధులు మంజూరు చేశారు. రంగనాయకసాగర్ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు మంజూరు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీలోనూ అభివృద్ధి ప‌నుల్లో వేగం పెరిగింది. ఎల్బీన‌గ‌ర్ లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను పేద‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు.


ప్రాంతీయ పార్టీలకు కొత్త సవాల్...బెంగాల్ ఎన్నికలు ?

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>