MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/present-situation-of-star-heroesa8e454b7-d470-4e71-b38a-002418c70e71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/present-situation-of-star-heroesa8e454b7-d470-4e71-b38a-002418c70e71-415x250-IndiaHerald.jpg'ట్రిపుల్ ఆర్' షూటింగ్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు కరోనా లాక్‌డౌన్‌తో బ్రేకులు పడ్డాయి. తర్వాత పర్మీషన్స్‌ వచ్చినా, తక్కువ క్రూతో ఈ హిస్టారికల్‌ డ్రామాని పూర్తి చేయడం కొంచెం కష్టం గానే మారింది. దీంతో 'ట్రిపుల్‌ ఆర్' 2021 సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. మరి సంక్రాంతి నుంచి తప్పుకున్న ఈ సినిమా ఎప్పటికి వస్తుందనేది మాత్రం తెలియడం లేదు. present situation of star heroes;chiranjeevi;balakrishna;boyapati srinu;kranthi;kranti;rajamouli;makar sakranti;cinema;sankranthi;jai simha;saira narasimhareddy;rulerస్టార్ హీరోల ప్రజెంట్ సిట్యుయేషన్..?స్టార్ హీరోల ప్రజెంట్ సిట్యుయేషన్..?present situation of star heroes;chiranjeevi;balakrishna;boyapati srinu;kranthi;kranti;rajamouli;makar sakranti;cinema;sankranthi;jai simha;saira narasimhareddy;rulerWed, 23 Dec 2020 05:00:00 GMTసంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. మరి సంక్రాంతి నుంచి తప్పుకున్న ఈ సినిమా ఎప్పటికి వస్తుందనేది మాత్రం తెలియడం లేదు.  

'ట్రిపుల్‌ ఆర్' రామరాజు కూడా థియేటర్లలో కనిపించి రెండేళ్లు అవుతోంది. 'వినయవిధేయరామ' తర్వాత రాజమౌళి 'ట్రిపుల్‌ ఆర్'లో జాయిన్ అయ్యాడు చరణ్. అసలే జక్కన్న చెక్కుడికి సినిమా లేట్‌ అవుతుంది అంటే, మధ్యలో కరోనా వచ్చిపడింది. షూటింగ్‌కి బ్రేకులేసింది. దీంతో 2019లో కనిపించిన చరణ్‌ మళ్లీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తాడు అన్నది బిగ్‌ క్వశ్చన్‌గా మారింది.

ప్రతీ ఫ్రైడే ఎంతమంది హీరోలొస్తున్నా చిరంజీవి, బాలక్రిష్ణ బరిలో దిగుతున్నాంటే థియేటర్లకి ఓ ఊపు వస్తుంది. ఈ సీనియర్లని చూడ్డానికి బాక్సాఫీస్‌ కూడా ఆతృతగా ఎదురుచూస్తుంది. అలాంటి హీరోలు థియేటర్లలో కనిపించి రెండేళ్లు అవుతోంది. ఇంకెన్నాళ్లకి జనాలముందుకొస్తారన్నది కూడా బిగ్‌ క్వశ్చన్‌ మార్క్‌గా కనిపిస్తోంది.

చిరంజీవి కమ్‌బ్యాక్‌లో డబుల్‌ ఎనర్జీతో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. యూనిక్‌ స్టోరీస్‌తో బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేస్తున్నాడు. అయితే హిస్టారికల్‌ డ్రామా 'సైరా' తర్వాత చిరంజీవి జనాలముందుకు రావడానికి చాలా టైమ్‌ పడుతోంది. 'సైరా' తర్వాత చిరు స్టార్ట్ చేసిన 'ఆచార్య' సినిమాకి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి.

చిరంజీవి 'ఆచార్య' సినిమాని 100రోజుల్లోనే పూర్తి చేస్తానని చెప్పాడు. ఫుల్‌ స్పీడ్‌గా ఈ సినిమా పూర్తి చేసి మెగాఫ్యాన్స్‌కి ఫీస్ట్ ఇస్తానని అనౌన్స్‌ చేశాడు. కానీ చిరు ప్లాన్స్‌కి కరోనాతో బ్రేకులు పడ్డాయి. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదా పడిన 'ఆచార్య' సెట్స్‌లో మెగాస్టార్ మళ్లీ అడుగుపెట్టడానికి రకరకాల అడ్డంకులు వచ్చాయి. దీంతో ఈ మూవీ వచ్చే సమ్మర్‌కి వెళ్లిపోతుందని సమాచారం.

బాలకృష్ణ 'లెజెండ్‌' తర్వాత మళ్లీ ఈ రేంజ్ హిట్ చూడలేదు. ఇక 'జైసింహా, రూలర్' ఫ్లాప్స్‌తో బాలయ్య ఫ్యాన్స్ కొంచెం డల్ అయ్యారు. దీంతో బోయపాటి శ్రీను సినిమా కోసం బాలక్రిష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్‌తో ఎన్.బి.కె. అభిమానుల ఆశలు వాయిదా పడుతున్నాయి. థియేటర్లు అయితే ట్వంటీ ట్వంటీలో బాలకృష్ణ సినిమానే చూడలేకపోయాయి. 


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీకాంత్ అడ్డాలో టీడీపీ అడ్రెస్ గల్లంతు....

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>