Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/online-loan-apps532c19f9-47b6-498d-9470-f4897a8c44cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/online-loan-apps532c19f9-47b6-498d-9470-f4897a8c44cc-415x250-IndiaHerald.jpgఆన్‌లైన్ లోన్ యాప్‌లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస ఆత్మహత్యల నేపథ్యంలో దీనిపై ఫోకస్ చేసిన పోలీసులు ఫ్రాడ్ యాప్‌లపై పంజా విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలోని గురు గ్రామ్ ప్రాంతంలోనూ ఇటీవల 17 మందిని అరెస్టు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆమోదం లేకుండానే ఇన్‌స్టంట్ లోన్ అప్లికేషన్లను నడపడమే కాక.. లోన్ కట్టని వారిని మానసికంగా హింసించి వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో..online loan apps;telangana;rbi;police;bank;panjaaఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!online loan apps;telangana;rbi;police;bank;panjaaWed, 23 Dec 2020 15:41:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస ఆత్మహత్యల నేపథ్యంలో దీనిపై ఫోకస్ చేసిన పోలీసులు ఫ్రాడ్ యాప్‌లపై పంజా విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలోని గురు గ్రామ్ ప్రాంతంలోనూ ఇటీవల 17 మందిని అరెస్టు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆమోదం లేకుండానే ఇన్‌స్టంట్ లోన్ అప్లికేషన్లను నడపడమే కాక.. లోన్ కట్టని వారిని మానసికంగా హింసించి వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా లోన్‌ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్‌ సెంటర్లపై దాడులు నిర్వహించారు. యాప్‌ యాజమాన్యాల దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో వాటి ప్రతినిధులు, టెలీ కాలర్ల మధ్య లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రతీ నెల టెలికాలర్‌కు జీతాల చెల్లింపు ఎక్కడి నుంచి జరుగుతుందనే అంశంపై కూడా విచారణ జరుపుతున్నారు. ఢిల్లీలోని గురుగ్రాం సమీపంలో 16 యాప్‌లకు సంబంధించిన 10 కాల్‌ సెంటర్లపై దాడులు చేయగా… అక్కడ 400 మంది టెలి కాలర్లుగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ కాల్‌ సెంటర్ ప్రతినిధులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా పోలీసులు మరింత సమాచారం రాబట్టారు.

సైబర్‌ క్రైం పోలీసుల విచారణలో హైదరాబాద్‌ కాల్‌ సెంటర్లలో 700 మంది టెలీకాలర్లు పని చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. కాల్ సెంటర్ల పనితీరుపై వీరిని విచారించగా.. టెలీ కాలర్లను S1, S2, S3లుగా విభజించి పనులు అప్పగిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సకాలంలో లోన్ రికవరీ చేయించిన టెలీ కాలర్లకు జీతంతో పాటు అదనంగా 10 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు ఇన్సెంటివ్‌లు కూడా యాజమాన్యాలు అందజేస్తున్నట్లు విచారణలో తేలింది.అంతేకాకుండా హైదరాబాద్‌లోనే మరో యాప్‌కు సంబంధించిన నిర్వాహకులు ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి సంబంధించిన రూ.1.52 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

ఇదిలా ఉంటే.. మైక్రో ఫైనాన్స్ యాప్‌లలో లోన్ తీసుకున్నవారు.. అసలులో సగానికి పైగా వడ్డీ రూపంలో చెల్లించినట్లు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు యాప్స్ యాజమాన్యాల బ్యంకు ఖాతా వివరాలనూ రిజర్వ్ బ్యాంక్ ద్వారా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలు ఒక్కసారి పోలీసుల చేతికి చిక్కితే ఇక యాప్ నిర్వాహకుల పని అయిపోయినట్లే. ఏది ఏమైనా ఆన్‌లైన్ లోన్ యాప్స్ ఉచ్చులో పడి ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కల్లోలం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్

సలార్‌లో హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ ఎవరిని ఎంచుకున్నారో తెలుసా?

మరిచిపోయామని అనుకుంటున్నారా?.. సీఏఏపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

ఇలా చేస్తే రేషన్ కార్డు చెల్లదు.. తేల్చేసిన కేంద్రం..?

అందం ఉంటే..ఆఫర్లు వస్తాయి..వారి కన్నీటి గాథ వింటే కన్నీళ్లు ఆగవు..

ఇళయరాజా రావచ్చు.. కానీ.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ప్రసాద్ స్టూడియోస్

పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>