PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/singareni-completed-100-yearsee8760f9-1d2d-4b06-899a-e904c83b3355-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/singareni-completed-100-yearsee8760f9-1d2d-4b06-899a-e904c83b3355-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ.. దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'. దేశంలోనే మొట్ట మొదట బొగ్గు ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టిన ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. 131 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా విస్తరించింది. singareni;vidya;hyderabad;india;godavari river;warangal;telangana;england;huzur nagar;gold;mandalam;village;december;electricity;singareni;history;survey;doctor;central government;adilabad;karimnagarతెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణికి వందేళ్లుతెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణికి వందేళ్లుsingareni;vidya;hyderabad;india;godavari river;warangal;telangana;england;huzur nagar;gold;mandalam;village;december;electricity;singareni;history;survey;doctor;central government;adilabad;karimnagarWed, 23 Dec 2020 09:27:29 GMTడాక్టర్ విలియం కింగ్స్ ప్రస్తుతం ఇల్లెందు మండలంగా ఉన్న బొగ్గుట్టలో బొగ్గు ఉనికిని కనుగొన్నారు. బ్రిటీష్ వారి పాలనలో 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్‌గా ఇంగ్లాండ్ స్టాక్ ఎక్చేంజ్‌లో నమోదు చేయబడిన సింగరేణి సంస్థ 1889లో ఉత్పత్తిని ప్రారంభించింది. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ఈ ఏడాదితో  సింగ‌రేణి సంస్థ ఆవిర్భానికి వందేళ్లు నిండాయి.

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా హైదరాబాద్ కంపెనీస్ యాక్టు ప్రకారం నమోదైన సింగరేణి తొలుత బ్రిటిష్‌ పాలకుల అజమాయిషీలో పనిచేసింది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర నైజాం రాజు అజమాయిషీలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ అధీనంలో కొనసాగింది. ఎన్నో కష్ట నష్టాలను భరించి.. అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రస్తుతం విజయప‌థంలో దూసుకెళుతోంది.
మొదట్లో చాల కొద్ది ప్రాంతానికే పరిమితమైన సింగరేణి బొగ్గు గనులు.. కాల గమనంలో విస్తరించాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలోని 350 కిలో మీటర్ల మేర నిక్షిప్తమై ఉన్న అపారమైన బొగ్గు ఖనిజాన్ని ఈ సంస్థ తవ్వి తీస్తోంది. దక్షిణ భారతదేశంలో సుమారు నాలుగు వేల పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కావలసిన ఇంధనం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొనసాగుతోంది.

బొగ్గు నిల్వల గుర్తింపు, ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి లెక్కిస్తే 131 ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. మూడు తరాల కార్మికుల చెమట చుక్కలకు ప్రత్యక్ష నిదర్శనంగా సింగరేణి విరాజిల్లుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. జియోలాజికల్‌ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గోదావరి తీరంలోని ఆరు జిల్లాల పరిధిలో 22వేల 207 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 1,500 మిలియన్‌ టన్నులకు పైగా బొగ్గును వెలికితీశారు.ఒకప్పుడు తట్టా చెమ్మస్‌‌తో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి, కాలానుగుణంగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉత్పత్తిలో అనేక కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన 1889లో ఏటా 59వేల 671 టన్నుల బొగ్గు తవ్విన కంపెనీ, ప్రస్తుతం 28 అండర్గ్రౌండ్ బొగ్గుగనులు, 18 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో దూసుకుపోతున్నది.

1956లో ఉమ్మడి రాష్ట్ర అవతరణ తర్వాత కంపెనీల చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థగా మార్పు చెందింది సింగరేణి. 1960లో మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో కంపెనీని విస్తరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ, రుణ సాయం పెంచడంతో కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి సంస్థగా మారింది. 1974లో కేంద్రప్రభుత్వం కంపెనీ మూల ధన వాటాను కేంద్ర బొగ్గు గనుల సంస్థకు బదిలీ చేసింది. అదే ఏడాది కేంద్రం, రాష్ట్రం, సింగరేణి సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్రం వాటా 51 శాతంగా ఉంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా సింగరేణి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది.






ప్రశాంత్, ఎన్టీఆర్ ల సినిమా ఉన్నట్లా...లేనట్లా..?

తన విగ్రహం గురుంచి స్పందించిన సోనూ సూద్.. ఏమన్నాడో తెలుసా.?

ఏపీ ప్రభుత్వం : ఆన్ లైన్ కాల్ మనీ కేసులపై ఉక్కుపాదం...!

కరోనా టైప్ -2 నేపథ్యంలో తెలంగాణ సంచలన నిర్ణయం..

డాక్టర్లను విడిచిపెట్టని జగన్ ... ! ఇక పల్లెల్లో ఏం చేయబోతున్నారంటే ?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>