PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmace87f23d-9fb3-42cb-a664-e7ca6257b1d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmace87f23d-9fb3-42cb-a664-e7ca6257b1d5-415x250-IndiaHerald.jpgలోక‌ల్ బాడీ ఎన్నికలకు తెర లేవనుందా. ఏపీలో మరో కొత్త సంగ్రామానికి రంగం సిధ్ధమవుతోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. స్థానిక సంస్థలు నిర్వహించే అధికారం కచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఎందుకంటే అది రాజ్యాంగ బద్ధ సంస్థ. ఆ నిర్ణయమే ఫైనల్. సహకరించడమే ప్రభుత్వం వంతు. nimma;kumaar;tiru;andhra pradesh;tirupati;panchayati;king;husband;tdp;local language;ycpలోకల్ బాడీ ఎన్నికలు కన్ ఫర్మ్ ?లోకల్ బాడీ ఎన్నికలు కన్ ఫర్మ్ ?nimma;kumaar;tiru;andhra pradesh;tirupati;panchayati;king;husband;tdp;local language;ycpWed, 23 Dec 2020 19:00:00 GMTస్థానిక సంస్థలు నిర్వహించే అధికారం కచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఎందుకంటే అది రాజ్యాంగ బద్ధ సంస్థ. ఆ నిర్ణయమే ఫైనల్. సహకరించడమే ప్రభుత్వం వంతు.

ఈ విషయం అందరికీ తెలిసినా మరో మారు హై కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పిన నేపధ్యంలో లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ కావడమే ప్రభుత్వం ముందున్న కర్తవ్యం అని అంటున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా స్థానిక ఎన్నికలకు  వెళ్లాలని టీడీపీ చూస్తూంటే ఆయన పదవీ విరమణ తరువాతనే ఎన్నికలు జరిపించాలని వైసీపీ సర్కార్ ఆలోచిస్తొంది.

ఈ నేపధ్యంలో వివాదాలు రాజుకుంటున్నాయి. కోర్టు గడపను అటూ ఇటూ తొక్కుతున్నారు. ఇపుడు హై కోర్టు దీని మీద తీర్పు చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్. సుప్రీం కోర్టు తలుపు తట్టడమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా కరోనా పేరు చెప్పి ఎన్నికలు జరపరాదని కోరినా ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ తీసుకున్న నిర్ణయం విషయంలో అత్యున్నత న్యాయ స్థానం ఎంతవరకూ జోక్యం చేసుకుంటుంది అన్నది కూడా చూడాలి. అక్కడ కూడా హై కోర్టు తీర్పుని సమర్ధిస్తే మాత్రం ఎన్నికలకు వెన్నక్కు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపించడానికి కూడా సిద్ధమయ్యారు. మరి ఎలా చూసుకున్నా లోకల్ బాడీ ఎన్నికలు ఆగేందుకు ఇప్పటికైతే ఏ విధమైన చాన్సూ లేనట్లేనని అంటున్నారు. అంటే ఓ వైపు తిరుపతి లొక్ సభ ఉప ఎన్నికలు, మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలతో ఏపీ రాజకీయం కొత్త ఏడాది వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.






కొందరు పోలీసులు కేసీఆర్ తొత్తులు! సంజయ్ హాట్ కామెంట్స్

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>