MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chittoor-nagaiah1554fd4d-b42f-4b00-9b7f-7af58fcf3fd2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chittoor-nagaiah1554fd4d-b42f-4b00-9b7f-7af58fcf3fd2-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు పద్మశ్రీ చిత్తూరు. వి.నాగయ్య గారిని ఆయన నటనను మనం ఎప్పటికి మరచిపోలేము..అనేక పాత చిత్రాలలో హీరోలకు తండ్రి పాత్రలలో నాగయ్య గారు నటించారు .. వేమన సినిమాలో వేమారెడ్డి పాత్రలో ఆయన కనబరిచిన నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. chittoor nagaiah;jeevitha rajaseskhar;maya;nagayya;rbi;cinema;director;chennai;house;father;v;padma shriదారుణంగా దగా పడ్డ నాగయ్య గారు..ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లేదారుణంగా దగా పడ్డ నాగయ్య గారు..ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లేchittoor nagaiah;jeevitha rajaseskhar;maya;nagayya;rbi;cinema;director;chennai;house;father;v;padma shriTue, 22 Dec 2020 18:00:00 GMTపద్మశ్రీ చిత్తూరు. వి.నాగయ్య గారిని ఆయన నటనను మనం ఎప్పటికి మరచిపోలేము..అనేక పాత చిత్రాలలో హీరోలకు తండ్రి పాత్రలలో నాగయ్య గారు నటించారు  .. వేమన సినిమాలో వేమారెడ్డి పాత్రలో ఆయన కనబరిచిన నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. నాగయ్య గారు తన జీవితం చూసుకుంటే .. సినిమా అవకాశాల కోసం ఇంటి నుండి చెన్నై కి వచ్చారట .. అక్కడే ఉంది అనేక ప్రత్నాలు చేశారట .. అయితే సినిమా అవకాశాల కోసం నాగయ్య గారు కలిసిన ప్రతి వారిని నమ్మరని ఆలా నమ్మి తనదగ్గరున్న డబ్బులను ఇచ్చేవారని .. ఆలా ఇచ్చి చాలా మంది దగ్గర నాగయ్య మోసపోయారు ..

ఇటీవలే ఆయనకు జరిగిన ఒక మోసం వార్తల్లోకి వచ్చింది..నాగయ్య గారు సినిమాల్లోకి రాకముందే అయన తండ్రి మరణించారు దీంతో అ ఆయన పేరు మీద ఉన్న  జీవిత బీమా డబ్బులు  పది వేల రూపాయలు వచ్చాయట ఆ  డబ్బుతో నాగయ్య మద్రాసు బయల్దేరి వెళ్లారు. అక్కడ మద్రాసు జార్జి టౌన్‌లో వున్న సర్దార్‌ భవన్‌ హోటల్లో వుండేవారు. అయితే అప్పుడే ఆయనకు అదే హోటల్లో బస చేస్తున్న రంగస్వామి పిళ్లై అనే ఒక వ్యక్తితో పరిచయమైంది. అతని వేషధారణ చూసి  ఒక పెద్ద జమీందారుల కనిపించడంతో అతి తక్కువ కాలంలోనే నాగయ్య అతనితో బాగా ఫ్రెండ్షిప్ చేసాడు. రంగస్వామి మంచి మాటకారి కావడంతో నాగయ్యను మాటల్లో పెడుతూ . తనకి  ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందనచెప్పి,  అందులో మీకు ఒక  అవకాశం ఇస్తానంటూ నాగయ్యకు మాయ మాటలు చెప్పారు .. ఒక ‌ స్టూడియోకు తీసుకెళ్లగా . అక్కడ నెల్లూరు నగరాజరావుకి రంగస్వామిని పరిచయం చేయగా  అతడు  ఏదైనా మంచి కథ ఉంటె మనం సినిమా చేయొచ్చు అని చెప్పగా నగరాజరావు నరనారాయణ  నేపథ్యంలో సినిమా తీద్దాం అని అనగా అయితే తన దగ్గర  సినిమా తీయడానికి డబ్బులు లేకపోవడంతో రంగస్వామి నాగయ్య ని అడగగా  నాగయ్య వెంటనే తన దగ్గర ఉన్న పదివేలరూపాయలు అతడికి ఇచ్చాడు ..  అయితే  ఒక వారం గడిచాక రంగస్వామి కొలంబో వెళ్లాలని అక్కడికి వెళ్లి ఒక లక్ష రూపాయలు పంపుతానని చెప్పి నాగయ్య దగ్గరున్న మిగతా 6 వేల రూపాయలు కూడా తీసుకొని వెళ్లిపోయాడు. ఇక  ఆ తర్వాత రంగస్వామి దగ్గర నుండి ఏ  కబురు రాలేదు. నెలరోజులు గడిచింది  అయినా ఎలాంటి సమాచారం రాలేదు .. దీంతో  ఒకరోజు నాగయ్య ‌ బ్యాంకుకు వెళ్ళి అడగగా ..రంగస్వామి ఎవరు, డ్రాఫ్టు ఇక్కడకు ఎలా వస్తుంది.   ఎవరో నిన్ను మోసం చేసారు అని చెప్పడంతో  నాగయ్య చాలా బాధ పడ్డారట .

అలా చేతిలో ఉన్న డబ్బును  పోగొట్టుకొని, నుంగంబక్కమ్‌లోని ఒక చిన్న గదిలో నాగయ్య ఉండవలసిన పరిస్థితి వచ్చింది.  తినడానికి తిండి లేక చాలా సార్లు నీళ్లుతాగి పొట్ట నింపుకున్నారట. ఎలాగైనా సినిమాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో డైరెక్టర్ బి.ఎన్‌.రెడ్డితో పరిచయం ఏర్పడడంతో ఇక అక్కడినుండి నాగయ్య వెనుతిరి చూసుకోలేదు ..  వరుసగా సినిమాలలో అవకాశాలు రావడం దాని ద్వారా బాగా డబ్బు సంపాదించడం జరిగింది.బాగా డబ్బు సంపాదించాకా దన గుణంతో అడిగిన వారికల్లా డబ్బును ఇచ్చేవారట .. దాంతో  నాగయ్య గారు మళ్ళీ  మోసపోయి ఆస్తులు అన్ని పోగొట్టుకున్నారు ..అలా ఆయన 30 ఏళ్ల సినిమా జీవితంలో  పెద్దగా సంపాదించింది ఏమి లేదట


కేసీఆర్ తెలంగాణాలో ఇది అమలు చేస్తే బెస్ట్...?

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>