MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-lily-eyed-beauty-new-business-324220e4-9ea4-46bf-b5f6-de4beafb7424-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-lily-eyed-beauty-new-business-324220e4-9ea4-46bf-b5f6-de4beafb7424-415x250-IndiaHerald.jpgరండి.. త్వరపడండి... లిమిటెడ్‌ స్టాక్ మాత్రమే. ఆశించిన ఆశాభంగం. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు. కొత్త పెళ్లికూతురు కాజల్. ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ ఇది. శ్రీవారికి ఉన్న టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో బిజినెస్‌లోకి దిగింది చందమామ. ఇంతకీ కాజల్‌ కిచ్లు మొదలుపెట్టిన వ్యాపారం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. lily eyed beauty new business;business;gowtam;kajal aggarwal;marriage;moon;anandamకలువ కళ్ల సుందరి కొత్త బిజినెస్..!కలువ కళ్ల సుందరి కొత్త బిజినెస్..!lily eyed beauty new business;business;gowtam;kajal aggarwal;marriage;moon;anandamTue, 22 Dec 2020 22:00:00 GMT
ప్రియుడు గౌతమ్‌ కిచ్లును కాజల్‌ ప్రేమించి పెళ్లి చేసుకుంది. హనీమూన్‌ కోసం  మాల్దీవులు వెళ్లి  ఎప్పడికప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తూ.. అందరూ తన గురించే మాట్లాడుకునేలా చేసింది.  వచ్చీరాగానే..  బిజినెస్‌ ఉమెన్‌గా మారిపోయింది. చిరంజీవితో నటిస్తున్న 'ఆచార్య' షూట్‌లో జాయిన్‌ అయిన కాజల్‌.. మరోవైపు వ్యాపారంపై కాన్సన్‌ట్రేషన్ చేస్తోంది. స్వతహాగా ఇంటీరియర్‌  డిజైనర్‌ అయిన భర్తతో కలిసి.. 'కిచ్డ్‌' హోమ్‌ డెకార్‌ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది కాజల్.

పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పింది కాజల్‌. అయితే..  ఆఫర్స్ వస్తాయా? రావా అన్న డౌట్ ఈ అమ్మడికి లేకపోలేదు. ఎంచక్కా భరత్తో కలిసి బిజినెస్‌లోకి దిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఫొటోతో పాటు ఓ పోస్ట్‌ చేసింది. గౌతమ్‌ నేను కలిసి 'కిచ్డ్‌'  అనే హోమ్‌ డెకార్‌ లేబుల్ తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా ఇద్దరి ప్రేమలో నుంచి ఈ బ్రాండ్‌ పుట్టిందని చెప్పుకొచ్చింది  కాజల్‌.

బిజినెస్‌మేన్‌ను పెళ్లి చేసుకుందో లేదో.. కాజల్‌కు వ్యాపారం బాగా అబ్బేసినట్టుంది. లిమిటెడ్‌ కలెక్షన్‌ మాత్రమే వుంది.. త్వరపడండి.. ఇప్పుడే షాపింగ్‌ స్టార్ట్‌ చేసేయండి అంటూ... పోస్ట్‌ చేసింది కాజల్‌. ఈ సందర్భంగా ఇద్దరు కుషన్స్‌తో ఆడుకుంటున్న స్టిల్ రిలీజ్‌ చేశారు. చూస్తుంటే.. త్వరలో చేయబోయే యాడ్‌లో కూడా ఈ ఇద్దరే కనిపిస్తారేమో. పెళ్లి తర్వాత  కాజల్ బిజినెస్‌లోకి దిగితే.. గౌతమ్‌ కిచ్లు యాక్టింగ్‌ మొదలుపెట్టాడన్న మాట. మొత్తానికి కలువకళ్ల సుందరి కాజల్ బిజినెస్ ఉమెన్ గా మారిపోయింది.




అభిజిత్ అందుకే హారికాని అంత బాగా చూసుకున్నాడట....

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>