PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-viruseddfddc8-f4d7-4aab-baa0-7ef12a5ed142-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-viruseddfddc8-f4d7-4aab-baa0-7ef12a5ed142-415x250-IndiaHerald.jpgఇప్పటికి కరోనా వైరస్ ప్రభావంతో దేశం, ప్రపంచ దేశాలు అన్నీ ఉప్పొంగుతున్నాయి. అన్నీ టెన్షన్ గా కాలం గడుపుతూ వస్తున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంతో ఇప్పటి వరకు ఉంటూ వచ్చారు. ఇప్పుడే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోరుకుంటూ వస్తున్నాయి. మళ్ళీ జనజీవనం యథాస్థితికి వస్తోంది. కొన్ని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి . అలాగే మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కరోనా నివారణ టీకా అందుబాటులోకి రాబోతుండడంతో ఈ మహమ్మారి బాధ ప్రపంచcarona virus countryes india;india;london;europe countries;kshanam;manadesam;coronavirusఅప్డేటెడ్ కరోనా ! కొత్త చిక్కులు ... కొత్త సందేహాలు ?అప్డేటెడ్ కరోనా ! కొత్త చిక్కులు ... కొత్త సందేహాలు ?carona virus countryes india;india;london;europe countries;kshanam;manadesam;coronavirusTue, 22 Dec 2020 02:00:00 GMTకరోనా వైరస్ ప్రభావంతో దేశం, ప్రపంచ దేశాలు అన్నీ ఉప్పొంగుతున్నాయి. అన్నీ టెన్షన్ గా కాలం గడుపుతూ వస్తున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంతో ఇప్పటి వరకు ఉంటూ వచ్చారు. ఇప్పుడే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోరుకుంటూ వస్తున్నాయి. మళ్ళీ జనజీవనం యథాస్థితికి వస్తోంది. కొన్ని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి . అలాగే మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కరోనా నివారణ టీకా అందుబాటులోకి  రాబోతుండడంతో ఈ మహమ్మారి బాధ ప్రపంచ దేశాలను వదిలిపోతుంది అని అంతా భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా  మరింత కంగారు పుట్టిస్తోంది. ఇది కరోనా  వైరస్ లోని మరో రకం కావడంతో పాటు ,వేగంగా విస్తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ఇప్పటికే యూరప్ దేశాలతో పాటు మిగతా దేశాలు ముందస్తుగా కఠిన చర్యలకు దిగాయి. అనేక దేశాల్లో బ్రిటన్ నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించారు.కొత్త రకం వైరస్ సోకిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. దీంతో లండన్ లో లాక్ డౌన్ విధించారు.



 అలాగే భారత్ , వివిధ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ప్రయాణాలు నిషేధించాయి . ఈ వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. కొత్త రకం కరోనా వైరస్ రూపాంతరం చెందుతున్న తీరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, పూర్తి సమాచారం వచ్చే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఇప్పుడు బ్రిటన్ వంటి దేశాలకు ప్రపంచ దేశాలు విమాన రాకపోకలపై నిషేధం విధించారు.  ఈ వైరస్ ప్రభావం, జరుగుతున్న నష్టం ఎంత అనేది అంచనా వేసే పనులు మిగతా ఉన్నాయి. అయితే ఈ కొత్త రకం వైరస్ గురించి ఎవరు ఆందోళన పడనవసరం లేదు అని, భారత్ ప్రభుత్వం చెబుతున్నా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తం అయ్యారు.



 ఈ వైరస్ ప్రభావం మరింత విస్తరిస్తే, ఏం చేయాలి అనే విషయం పైన భారత ప్రభుత్వం దృష్టి పెట్టి.. ఈ వైరస్ ప్రభావం, దాని కారణంగా జరిగే నష్టం, మనదేశంలో కి రాకుండా అడ్డుకునే విధానం వంటి వ్యవహారాలపై అధికారులతో  సమావేశాలు నిర్వహిస్తూ, భారత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.


ఆ కమ్మ నేత వైసీపీపై రివెంజ్ ప్లాన్ చేశారా?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>