PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-nara-brahmani-entry-in-politics-71fd23a0-b441-4b0c-8262-00e54f63a002-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-nara-brahmani-entry-in-politics-71fd23a0-b441-4b0c-8262-00e54f63a002-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నందమూరి-నారా కుటుంబాల పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. ఈ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి దివంగత ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ ప్రజల్లో చెరగని ముద్రవేసుకున్నారు. నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టి, రెండు సార్లు ఉమ్మడి ఏపీ, ఒకసారి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాగే రెండుసార్లు ఉమ్మడి ఏపీ ప్రతిపక్ష నాయకుడుగా చేశారు. ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నారు. nara brahmani;ntr;venkatesh;lokesh;balakrishna;bhuvaneshwari;harika;harikrishnan;suhasini;telugu desam party;nara lokesh;vijayawada;andhra pradesh;telugu;daggubati venkateswara rao;tdp;daggubati purandeswari;lokesh kanagaraj;nandamuri taraka rama rao;nara brahmani;heritage foods;party;nara bhuvaneshwariబ్రాహ్మణిని బరిలో దించుతారా?బ్రాహ్మణిని బరిలో దించుతారా?nara brahmani;ntr;venkatesh;lokesh;balakrishna;bhuvaneshwari;harika;harikrishnan;suhasini;telugu desam party;nara lokesh;vijayawada;andhra pradesh;telugu;daggubati venkateswara rao;tdp;daggubati purandeswari;lokesh kanagaraj;nandamuri taraka rama rao;nara brahmani;heritage foods;party;nara bhuvaneshwariTue, 22 Dec 2020 04:00:00 GMTతెలుగుదేశం పార్టీ స్థాపించి దివంగత ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ ప్రజల్లో చెరగని ముద్రవేసుకున్నారు. నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టి, రెండు సార్లు ఉమ్మడి ఏపీ, ఒకసారి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాగే రెండుసార్లు ఉమ్మడి ఏపీ ప్రతిపక్ష నాయకుడుగా చేశారు. ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నారు.

అయితే ఈ నందమూరి-నారా కుటుంబాల నుంచి పలువురు రాజకీయాల్లోకి వచ్చారు. హరికృష్ణ, నారా రామ్మూర్తి నాయుడు, బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, నారా లోకేష్ పలువురు రాజకీయాల్లోకి వచ్చారు. ఇక ఇప్పుడు నందమూరి ఆడపడుచు, నారా వారి ఇంటి కోడలు అయిన నారా బ్రాహ్మణి సైతం రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ వస్తుంది. బాలయ్య కుమార్తె, చంద్రబాబు కోడలు అయిన బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ వ్యవహారాలని చూసుకుంటుంది. అయితే తాజాగా బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా పలువురు టీడీపీ అభిమానులు, ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడితే బాగుంటుందని మాట్లాడుతున్నారు. అయితే గత ఎన్నికల్లోనే బ్రాహ్మణి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. విజయవాడ ఎంపీగానే ఆమె పోటీ చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఆమె ఎప్పటిలాగానే హెరిటేజ్ వ్యవహారాలని చూసుకుంటున్నారు. అయితే పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఇలాంటి సమయంలో బ్రాహ్మణి చురుకైన మహిళా పార్టీలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం బ్రాహ్మణి పోలిటికల్ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. లోకేష్ రాబోయే రోజుల్లో టీడీపీ పగ్గాలు చేపట్టాలి కాబట్టి, బ్రాహ్మణిని ఇప్పుడే రాజకీయాల్లోకి దించే అవకాశాలు లేవని తెలుస్తోంది. లేదంటే భువనేశ్వరి మాదిరిగా బ్రాహ్మణి కూడా రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి చూడాలి రాబోయే రోజుల్లో బాబు, బ్రాహ్మణి విషయంలో ఎలంతో నిర్ణయం తీసుకుంటారో.




కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>