HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant3d57e47f-c7c3-4837-9eec-6d0ab0afad79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant3d57e47f-c7c3-4837-9eec-6d0ab0afad79-415x250-IndiaHerald.jpgప్రతీ మహిళ జీవితంలో తల్లి కావాలని ఆశపడతారు. వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ అబార్షన్ అనే విపత్కర పరిస్థితిని చాలా సందర్భాల్లో ఎదుర్కొంటారు. దీనికి క్రోమోజోమ్ సమస్యలు, యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, ఇమ్యునలాజికల్ సమస్యలు, సెప్టేట్ యుటెరస్, హార్మోన్ సమస్యలు వీటితో పాటు థైరాయిడ్, డయాబెటీస్, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లాంటివి కారణాలు అవుతాయి. మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు నాణ్యతగా ఉండకపోయినా ఈ సమస్య ఎదురవుతుంది. పోనీ, అవి సరిగ్గా ఉన్నా.. ఆడవారిలో అండం సరిగ్గా లేకపోతే కూడా ఇదే సమస్య ఎదురవుతుందిpregnancy;women;jeevitha rajaseskhar;telugu;woman;chequeమాతృత్వాన్ని దూరం చేసే అబార్షన్లకు ఇలా చెక్ పెట్టండి!మాతృత్వాన్ని దూరం చేసే అబార్షన్లకు ఇలా చెక్ పెట్టండి!pregnancy;women;jeevitha rajaseskhar;telugu;woman;chequeTue, 22 Dec 2020 11:00:00 GMT మహిళ తన జీవితంలో తల్లి కావాలని.. మాతృత్వాన్ని ఆస్వాదించాలి అని.. పరిపూర్ణ మహిళగా తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని అనుకుంటారు, ఆశ పడతారు. అయితే ఇలాంటి వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ అబార్షన్ అనే విపత్కర పరిస్థితిని కూడా చాలా సందర్భాల్లో ఎదుర్కొంటారు మహిళలు. ఇలాంటి పరిస్థితి కేవలం ఒకసారి మాత్రమే కాకుండా చాలాసార్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటారు కొంతమంది మహిళలు. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇలా ప్రతిసారీ అబార్షన్ అవ్వడాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. క్రోమోజోమ్ సమస్యలు, యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, ఇమ్యునలాజికల్ సమస్యలు, సెప్టేట్ యుటెరస్, హార్మోన్ సమస్యలు వీటితో పాటు థైరాయిడ్, డయాబెటీస్, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లాంటివి కారణాలు అవుతాయి. అంతేనా.. మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు నాణ్యతగా ఉండకపోయినా ఈ సమస్య ఎదురవుతుంది. పోనీ, అవి సరిగ్గా ఉన్నా.. ఆడవారిలో అండం సరిగ్గా లేకపోతే కూడా ఇదే సమస్య ఎదురవుతుంది.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

సమస్య పరిష్కారమవ్వాలంటే.. ముందుగా దేనివల్ల అబార్షన్ అవుతుందో తెలుసుకోవడం ముఖ్యం. అందుకోసం అన్ని పరీక్షలు చేయించాలి. సమస్యల గురించి తెలుసుకోవాలి. దీంతో పాటు.. దానికి ట్రీట్‌మెంట్ చేయించాలి. అందుకు నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. ఇలా చేస్తే కచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది.. గర్భం నిలబడుతుంది. ఎందుకంటే ప్రతీ చికిత్స విధానంలో అధునాతనమైన చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అన్ని పరీక్షలు చేసి అన్ని విధాలైన ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత కనీసం ఓ సంవత్సరం పాటు ఎదురుచూడాలి. అప్పటికీ సమస్య అలానే ఉంటే గనుక ఐవీఎఫ్‌ని ఆశ్రయించడం మేలు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. పండంటి బిడ్డ మన ముందుంటారు. ఈ విషక్ష్ాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి చికిత్స కోసం నిపుణులు సంప్రదించాలి. అప్పుడే మీ సమస్య పరిష్కారమవుతుంది. మీరూ మాతృత్వాన్ని ఆనందించగలరు. అయితే, ఈ సమస్యను పదే పదే తలుచుకుని ఒత్తిడికి గురవ్వడం అంత మంచిది కాదు. దీని వల్ల వ్యతిరేక పరిణామాలే ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


నాని సినిమా లో లుక్ అంత సీక్రెట్ గా ఉంచారేంటి..?

డబ్బుకోసం చెల్లిపై దారుణానికి ఒడిగట్టిన అక్క... అయ్యో పాపం..

ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంలో జస్టిస్ కీలక వ్యాఖ్యలు!

రెండు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలో బ్యాగ్ ప్రాణం తీసింది..?

విశాఖకు రాజధాని ఖాయం..?

తెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>